స‌రికొత్త లుక్‌లో హీరో రామ్.. ఫోటో వైరల్‌..

16
hero ram

హీరో రామ్ పోతినేనికి టాలీవుడ్‌లో ఉన్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్లాస్‌గా కనిపించే ఈ హీరో.. అప్పుడప్పుడూ మాస్ సినిమాలు చేసినా కూడా ఎక్కువగా క్లాస్ పాత్రలతోనే ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. కానీ ఇదంతా రెండేళ్ళ ముందు వరకు. ఎప్పుడైతే ఇస్మార్ట్ శంకర్ సినిమా విడుదలైందో.. అప్పట్నుంచే రామ్ తనను తాను పూర్తిగా మార్చుకున్నాడు.

ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రంతో కెరీర్‌లోనే బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టిన రామ్ ఇప్పుడు త‌మిళ ద‌ర్శ‌కుడు లింగుస్వామితో యాక్ష‌న్ ఓరియెంటెడ్ సినియా చేస్తున్న విష‌యం తెలిసిందే. ముప్పై రోజుల పాటు జ‌రిగిన తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న రామ్ ఇప్పుడు కొత్త షెడ్యూల్ కోసం సిద్ధ‌మ‌వుతున్నాడు. ఈ సినిమా తెలుగుతో పాటు త‌మిళంలోను రూపొంద‌నుంది. ఇక రామ్‌ను ఢీ కొట్టే ప్రతినాయకుడిగా ఆది పినిశెట్టి కనిపించనున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎప్పుడూ చేయ‌ని స‌రికొత్త పాత్ర‌లో రామ్ క‌నిపించ‌బోతున్నాడు. రామ్ ఇందులో పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌నున్నాడు. ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి ఆయ‌న స‌ర‌స‌న‌ హీరోయిన్‌గా న‌టిస్తుంది.

అయితే ఈ సినిమా కోసం రామ్ చాలా హార్డ్ వ‌ర్క్ చేస్తున్న‌ట్టు తెలుస్తుంది. ముఖ్యంగా భారీగా కండ‌లు పెంచి స‌రికొత్త లుక్‌లో ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా విడుదలైన ఈ ఉస్తాద్‌ ఫోటోలు చూస్తుంటే షాక్‌ అవుతున్నారు ఫ్యాన్స్‌. అందులో రామ్ లుక్ పిచ్చెక్కిస్తుంది. ముఖ్యంగా కండలు తిరిగిన దేహంతో బళ్లాలదేవుడికి అన్నలా ఉన్నాడు ఈయన. ఎక్కడికక్కడ ఫిజిక్ పరంగా సరికొత్త రామ్‌ను అభిమానులకు పరిచయం చేస్తున్నాడు ఈ ఉస్తాద్‌.