బిగ్ బాస్ ఎవరో చెప్పేసిన హేమ

513
Hema Biggboss
- Advertisement -

రియాల్టీ షో బిగ్ బాస్ పై సంచలన కామెంట్స్ చేసింది నటి హేమ. బిగ్ బాస్ 3 లో అడుగుపెట్టి మొదటివారంలోనే ఎలిమినెట్ అయ్యింది హేమ. హౌస్ నుంచి బయటకు రాగానే ఆమె బిగ్ బాస్ గురించి మొత్తం చెప్పేసింది. అయితే తాజాగా ఆమె మరోసారి బిగ్ బాస్ పై కామెంట్స్ చేసింది. తనను కావాలనే బిగ్ బాస్ హౌస్ నుంచి పంపించేసారని చెప్పింది. బిగ్‌బాస్ హౌస్‌లో తన గురించి పూర్తి ఏవీ వేయలేదని.. తన ఎంట్రీని దరిద్రంగా చూపించారని ఆరోపించింది.

బిగ్ బాస్ హౌస్ లో అంతా ప్లానింగ్ ప్రకారమే జరుగుతుందన్నారు. ప్లాన్ ప్రకారమే తనను బయటకు పంపించారని ఆరోపణలు చేసింది. ఇక శ్రీముఖి తనతో మంచిగ ఉంటున్నట్లు నటించిందని..శ్రీముఖి మైండ్ గేమ్ కు చాలా మంది బలి అయ్యారని చెప్పింది. హిమజ వచ్చేశాక బిగ్‌బాస్ చూడటమే మానేశానని చెప్పుకోచ్చింది. బిగ్‌బాస్ అంటే ఎవరో కాదు ఎడిటరే బిగ్‌బాస్ వాళ్లు నెగిటీవ్‌ని మాత్రమే చూపిస్తారని బాంబ్ పేల్చింది. హేమ వ్యాఖలపై మిగతా పాటిసిపెంట్స్ ఎలా స్పందిస్తారో చూడాలి మరి.

- Advertisement -