రాఘవాచారి మృతి పట్ల అల్లం నారాయణ సంతాపం..

476
allam narayana
- Advertisement -

పాత్రికేయ విలువలకు, నిబద్ధతకు రాఘవాచారి పెట్టింది పేరని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. ప్రముఖ పాత్రికేయులు, సీనియర్‌ జర్నలిస్టు, విశాలాంధ్ర మాజీ ఎడిటర్ చక్రవర్తుల రాఘవాచారి మరణంపై మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

రాఘవాచారి ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం చేశారని, తెలుగు జర్నలిజంలో సుధీర్ఘ కాలం పనిచేశారని, జర్నలిజంకు ఆయన అందించిన సేవలు కలకాలం నిలిచిపోతాయని కొనియాడారు. రాఘవాచారి కుటుంబ సభ్యులకు చైర్మన్ అల్లం నారాయణ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ప్రముఖ పాత్రికేయులు చక్రవర్తుల రాఘవాచారి ఇవాళ తెల్లవారుజామున మృతి చెందారు. నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. గత కొద్ది రోజులుగా ఆయన అనారోగ్యంతో భాద పడుతున్నట్లు సమాచారం. ప్రజల సందర్శనార్థం రాఘవాచారి పార్థవదేహాన్ని హిమాయత్‌నగర్‌లోని సీపీఐ కార్యాలయానికి తరలించారు.

- Advertisement -