Bigg Boss 7:యావర్‌తో శ్రీముఖి

117
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 7 తెలుగు విజయవంతంగా 104 రోజులు పూర్తి చేసుకుంది. ఇక బిగ్ బాస్ విజేత ఎవరో తేలే ఒకరోజు ముందు హౌస్‌లో సందడి చేసింది శ్రీముఖి. అలాగే ఫన్నీ టాస్కులు, గేమ్స్‌తో అందరిని ఎంటర్‌టైన్ చేశాడు బిగ్ బాస్.

తర్వాత హౌస్‌లో జరిగిన కొన్ని ఐకానిక్ సన్నివేశాలను రీ క్రియేట్ చేసే అవకాశం ఇచ్చారు. ఇందులో భాగంగా ఇతర సభ్యులను ఇమిటేట్ చేసే అవకాశం అంటే అమర్‌దీప్ ఓడిపోయిన కెప్టెన్సీ బ్రిక్స్ టాస్కు ఇచ్చాడు బిగ్‌బాస్. అమర్ పాత్రలో అర్జున్.. గౌతమ్‌లా అమర్ నటించారు. అర్జున్ అయితే అమర్‌ని దించిపడేశాడు. సైకోలా అరుస్తూ అచ్చం గౌతమ్‌ని తలపించాడు.

తర్వాత నామినేషన్స్‌లో అమర్ – ప్రశాంత్ వ్యవహరించే సీన్‌ని శివాజీ – అర్జున్ రీ క్రియేట్ చేశారు. అమర్‌లా శివాజీ ఆకట్టుకోగా ప్రశాంత్‌లా అర్జున్ సూపర్బ్ అని పించారు. ఇక తర్వాత హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది బుల్లితెర యాంకర్ శ్రీముఖి. యావర్‌పై కన్నేసిన శ్రీముఖి..ఓ ప్రియ ప్రియ అంటూ యావర్ పాడుతుంటే సాయంత్రం నువ్వు ఫ్రీఆ అంటూ లిరిక్స్ కలిపింది శ్రీముఖి.

Also Read:‘దేవర’లో హైలైట్ ఎపిసోడ్ అదే

- Advertisement -