- Advertisement -
తూర్పు విదర్భ మరియు దాని పరిసర ప్రాంతాలలో 5.8 km ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఝార్ఖండ్ నుండి కొంకన్ వరకు చత్తీస్ గఢ్, తెలంగాణ మరియు ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదుగా 3.1 km ఎత్తు వద్ద shear zone ఏర్పడింది. దీంతో తెలంగాణలో ఈ రోజు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
రేపు, ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉందని.. రాష్ట్రంలో ఈరోజు నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ఆదిలాబాద్, కోమరంభీం, నిర్మల్ మరియు మంచిర్యాల జిల్లాలలో ఒకటి రెండు చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
- Advertisement -