చెఫ్‌గా మారిన ఎన్టీఆర్.. కొడుకులకు పాఠాలు..!

231
NTR
- Advertisement -

దేశవ్యాప్తంగా కరోనా లాక్‌డౌన్‌ కారణంగా కొన్ని నెలలుగా సినీ తారలు ఇళ్లకే పరిమితమైయ్యారు. ఇక‌ పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు ఇంట్లోనే ఉంటు తమ ఫ్యామిలీతో సరదాగా గడుపుతున్నారు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తమ విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఇక అసలు విషయానికొస్తే.. హీరో యంగ్ టైగర్‌ ఎన్టీఆర్ తన భార్య పిల్లలతో ఇంట్లోనే ఉంటు హ్యాపీగా గడిపుతున్నాడు.

అంతేకాదు వంటలో ప్రావీణ్యం ఉన్న ఎన్టీఆర్ తన ఫ్యామిలీ కోసం చెఫ్‌గా మారి రుచికరమైన వంటకాలు చేస్తున్నాడట. అలాగే కొడుకులు అభిరామ్ మరియు భార్గవ్ రామ్ లకు తెలుగులో శిక్షణ కూడా ఇస్తున్నాడట. అలాగే తాతయ్య తారకరామారావు సినిమాలను వారితో కలిసి చూస్తూ ఆస్వాదిస్తున్నాడట ఎన్టీఆర్‌. ప్రస్తుతం యంగ్‌ టైగర్‌ తన కుటుంబంతో సరదాగా ఎంజాయ్‌ చేస్తున్నాడు.

ఇక ఎన్టీఆర్‌ ప్రస్తుతం రాజమౌళి ఆర్ఆర్ఆర్ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ ష్యూటింగ్‌ లాక్‌డౌన్‌ కారణంగా అగిపోయింది. ఇటివలే సినిమా ష్యూటింగ్‌లకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో మరి కొన్ని రోజుల్లో ఆర్‌ఆర్‌ఆర్‌ ష్యూటింగ్ తిరిగి మొదలుకానుంది. త్వరలో ఎన్టీఆర్ షూటింగ్ లో జాయిన్ కానున్నారు. కాగా ఈ చిత్రంలో యంగ్‌ టైగర్‌ కొమరం భీమ్‌గా నటిస్తుండగా రాంచరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్ర చేస్తున్నారు. ఈ మూవీ 2022లో విడుదల కానుంది.

- Advertisement -