- Advertisement -
వరదలతో దక్షిణకొరియా అతలాకుతలమైంది. ఎడతెరపిలేకుండా వర్షాలు కురుస్తుండటంతో కొండచరియలు విరిగిపడి 26 మంది మృతిచెందారు.మంగళవారం నుంచి కుండపోత వర్షాల కారణంగా 10 మంది గల్లంతయ్యారని, గురువారం నుంచి మరో 13 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు.
మధ్య, ఆగ్నేయ ప్రాంతాల్లో కుండ పోత వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి ఐదు ఇళ్లు కూలిపోయాయని చెప్పారు. జులై 9వతేదీ నుంచి గాంగ్జు నగరం, చియోంగ్‌యాంగ్ కౌంటీలో 600 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. దక్షిణ కొరియాలోని మధ్య ప్రాంతాల్లోనూ అత్యధిక వర్షపాతం నమోదైంది.
భారీవర్షాల వల్ల 25,470 ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 4,200 మంది నిరాశ్రయులను తాత్కాలిక శిబిరాలకు తరలించారు. భారీవర్షాలు, వరదల వల్ల 20 విమాన సర్వీసులు, బుల్లెట్, సాధారణ రైలు సర్వీసులను నిలిపివేశారు. 200 రోడ్లను వరదనీటి ప్రవాహంతో మూసివేశారు.
- Advertisement -