పవన్ లేకుండానే OG!

53
- Advertisement -

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ లేకుండా ఆయన నటిస్తున్న OG షూటింగ్ జరుగుతోంది. సుజిత్ దర్శకత్వంలో గ్యాంగ్ స్టార్ నేపథ్యంలో సినిమా తెరకెక్కుతోంది. ఇక ఇప్పటివరకు 50 రోజుల సినిమా షూటింగ్ పూర్తయిందని చిత్రయూనిట్ వెల్లడించింది.

ఇప్పటికే సినిమాకు సంబంధించి మూడు షెడ్యూల్స్‌ పూర్తికాగా నాలుగో షెడ్యూల్ ప్రారంభమైంది. ఈ షెడ్యూల్ కూడా హైదరాబాద్ లోనే జరుగుతున్నట్లు సమాచారం. పవన్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది. తమిళ్ స్టార్ యాక్టర్స్ అర్జున్ దాస్, శ్రియారెడ్డి ,బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి కీ రోల్ పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.

ప్రస్తుతం పవన్ వారాహి యాత్రలో బిజీగా ఉండగా గ్యాప్ వస్తే సినిమా షూటింగ్‌లో జాయిన్ కానున్నట్లు తెలుస్తోంది.

Also Read:పనస విత్తనాలతో కలిగే లాభాలెన్నో..!

- Advertisement -