భారీ వర్షం…తడిసి ముద్దైన ధాన్యం

69
rains
- Advertisement -

ఉపరిత ద్రోణి ప్రభావంతో బుధవారం తెల్లవారుజామున హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడినన వాన బీభత్సం సృష్టించింది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా నీరు నిలిచిపోయింది.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడగా వర్షం కారణంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్న వరి ధాన్యం తడిసి ముద్దయ్యాయి. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులు, మెరుపులు, ఉరుములతో కూడిన భారీ వర్షం పడింది. తూప్రాన్, చేగుంట, నార్సింగ్, వెల్దుర్తి, మాసాయిపేట్‌లో మండలాల్లో వర్షం కూడా భారీ వర్షం కురిసింది.

నల్లగొండ జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాల్లో ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో భారీగా వర్షం కురిసింది. భారీ వర్షానికి పలు మండలాల్లోని ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిసిపోయింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ వర్షంతో భువనగిరి పట్టణం జలమయమయింది. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలోని క్యూ కాంప్లెక్స్‌లోకి వర్షపునీరు చేరింది.

- Advertisement -