ఎన్టీఆర్ స్టైలే డిఫరెంట్: శేఖర్ మాస్టర్

76
shekar master
- Advertisement -

టాలీవుడ్ అగ్రశ్రేణి కొరియోగ్రాఫర్‌లలో ఒకరు శేఖర్ మాస్టర్. ఇటీవల ఓ ఇంటర్య్వూలో తన నెక్ట్స్ ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ ఎన్టీఆర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ తో చాలా పాటలకి వర్క్ చేశాను. ఆయన డ్యాన్స్ లో ఒక డిఫరెంట్ స్టైల్ ఉంటుందన్నారు.

ఆయన ఎప్పుడు రిహార్సిల్స్ కి రారని…. డైరెక్ట్ గా సెట్ కి వచ్చేస్తారని తెలిపారు. షూట్ లో స్టెప్ ఒక్కసారి చేసి చూపిస్తే అర్ధం చేసేసుకొని చేసేస్తారు. ఎలాంటి కష్టమైన స్టెప్ అయినా ఇట్టే పట్టేస్తారన్నారు.

ప్రస్తుతం శేఖర్ కొరియోగ్రఫీ చేసిన మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ మే 12న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలలో ఆసక్తికర విషయాలు వెల్లడిస్తున్నారు. ఇటీవల చిరంజీవి 154 సినిమా టైటిల్‌ని కూడా రివీల్ చేసిన సంగతి తెలిసిందే.

- Advertisement -