చలికాలంలో ఈ జాగ్రత్తలు..తప్పనిసరి!

36
- Advertisement -

ప్రతి ఏడాది కూడా సీజనల్ గా వాతావరణ మార్పులు రావడం సాధారణం. అలా వర్షాకాలం తరువాత చలికాలం ఆ తరువాత ఎండాకాలం వస్తుంటాయి. అయితే మారుతున్న సీజన్ ను బట్టి వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా మన ఆరోగ్యంలో కూడా మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. కాబట్టి సీజన్ కు తగినట్టుగా ఆరోగ్యంపై శ్రద్ధ ఉంచండం ఎంతో ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. ఇక చలికాలం రానే వచ్చింది. ఈ వింటర్ సీజన్ లో ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. తరచూ జలుబు బారిన పడడం, దగ్గు, తలనొప్పి, వంటి సమస్యలతో పాటు మలబద్దకం, కీళ్ల నొప్పులు వంటి సమస్యలు కూడా వేధిస్తాయి. అందువల్ల ఈ చలికాలంలో కొని జాగ్రత్తలు పాటించడం వల్ల ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు..

ముఖ్యంగా వింటర్ సీజన్ లో రోగనిరోధక శక్తి ఎక్కువగా కోల్పోతూ ఉంటాము అందుకే తరచూ ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. అందువల్ల రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ సి ఉన్న పదార్థాలు లేదా పండ్లు ఎక్కువగా తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆరెంజ్, నిమ్మ, దానిమ్మ, జామ వంటి పండ్లలో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని డైలీ ఆహార డైట్ లో చేర్చుకోవాలి. ఇక చలికాలంలో జీర్ణ సంబంధిత సమస్యలు కూడా అధికం. అందుకే ఫైబర్ ఎక్కువగా ఉండే పదార్థాలు అనగా బ్రోకలి, చిలకడ దుంప, ఆకుకూరలు వంటివి ఎక్కువగా తినాలట.

ఇక వీలైనంత వరకు చల్లటి పదార్థాలకు దూరంగా ఉండడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ శరీరం హైడ్రేడ్ గా ఉండేందుకు కెఫీన్, ఆల్కహాల్ వంటివి తగ్గించి, హెర్బల్ టీ లేదా కాఫీ, వెచ్చని వివిధ రకాల సూప్ వంటివి తాగడం అలవాటు చేసుకుంటే మంచిది. ఇక ఈ చలికాలంలో పగటి సమయం తక్కువ, రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి శరీరానికి తగినంతా నిద్ర పోవడం, సమయానుసారంగా వ్యాయామం చేయడం ఎంతో ముఖ్యం. కాబట్టి చలికాలంలో ఈ కనీసపు జాగ్రత్తలు పాటించడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలనైనా ఎదుర్కోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Also Read:ఓటీటీ : ఈ వారం చిత్రాలివే

- Advertisement -