‘చిలకడదుంప’ తింటే ఏమౌతుందో తెలుసా?

100
- Advertisement -

సీజన్ ను బట్టి దొరికే వాటిలో చిలకడదుంప కూడా ఒకటి.. ముఖ్యంగా శీతాకాలంలో ఇవి అధికంగా లభిస్తాయి. చూడడానికి బంగాళదుంపను పోలీవుండే ఇది.. రుచిలో మాత్రం కాస్త తియ్యదనం కలిగిఉంటుంది. అందుకే దీన్ని స్వీట్ పొటాటో అని కూడా అంటారు. దీనిని కచ్చపచ్చిగాను లేదా ఉడకబెట్టుకొని కూడా తింటూ ఉంటారు. అయితే ఇది ఉడకబెట్టిన తరువాత కాస్త జిగటుగా మారుతుంది కాబట్టి చాలమంది చిలకడదుంపను తినడానికి ఇష్టపడరు. అయితే ఈ చిలకడదుంపలో ఎన్నో పోషకవిలువలు ఉన్నాయి. విటమిన్ ఏ, సి, బి6, వంటి వాటితో పాటు ఐరన్, కాల్షియం వంటివి కూడా ఉంటాయి. .

ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు చిలకడదుంప తినడం ఎంతో మంచిదట. ఎందుకంటే ఇది ఇన్సులిన్ స్థాయిని తగ్గించి రక్తంలో గ్లూకోజ్ ను క్రమబద్ధం చేస్తుంది. చిలకడదుంపలో పీచు అధికంగా ఉంటుంది. ఇది ఆహారం త్వరగా జీర్ణం అవ్వకుండా చేస్తుంది. తద్వారా సులభంగా బరువు తగ్గవచ్చు. ఇక ఇందులో ఉండే విటమిన్ బి6 గుండె సమస్యలను తగ్గిస్తుంది. రక్తసరఫరా సవ్యంగా ఉండేలా చేస్తుంది. ఇక ఇందులో ఉండే విటమిన్ చర్మం పొడిబారకుండా చూడడంతో పాటు కంటి చూపును మెరుగుపరుస్తుంది. చిలకడదుంపలో మాంగనీస్, పొటాషియం వంటివి కూడా ఉంటాయి. పొటాషియం అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది.

ఇక మాంగనీస్ రక్తంలో గ్లూకోజ్ శాతాన్ని స్థిరంగా ఉంచుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి, మరియు ఈ లు రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర వహిస్తాయి. ఇందులో ఉండే విటమిన్ ఈ శీతకాలంలో చర్మం పొడిబారకుండా చూస్తుంది. అయితే చిలకడదుంప వల్ల ఎన్నో ప్రయోజనలు ఉన్నప్పటికి వీటివల్ల కొంత నష్టాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మార్కెట్ లో కల్తీ చిలకడదుంపలు అధికమౌతున్నాయి. రోదమైన్ బి అనే కృత్రిమ రంగు ద్వారా చిలకడదుంపలను కొందరు కల్తీ చేస్తున్నారు. అందువల్ల చిలకడదుంపలలో కల్తీవి ఏవి ? మంచివి ఏవి అని తెలుసుకునేందుకు.. కొద్దిగా కాటన్ తీసుకొని, వెజిటల్ నూనెలో ఆ కాటన్ ముంచాలి. ఆ తరువాత ఆ కాటన్ ను చిలకడదుంపపై రుద్దాలి. ఇలా చేసినప్పుడు చిలకడదుంప మంచిది అయితే కాటన్ రంగు మారదు. అలా కాకుండా చిలకడదుంపపై రుద్దినప్పుడు కాటన్ వైలెట్ రంగులోకి మారితే.. అది కల్తీది అని గుర్తించాలి.

Also Read:రాజశేఖర్ అందుకే ఒప్పుకున్నాడట

- Advertisement -