బాలయ్య.. ఈ అతి అవసరమా?

35
- Advertisement -

అనిల్ రావిపూడి మంచి దర్శకుడే, నంద‌మూరి బాల‌కృష్ణ‌ స్టార్ హీరోనే, భ‌గ‌వంత్ కేస‌రి సినిమాకి బాగానే డిమాండ్ ఉంది, ఇవ్వన్నీ నిజాలే, కానీ.. ఎంతవరకు ?, ఫస్ట్ షో పడేంత వరకు. సినిమా బాగుంది అని టాక్ వస్తే.. ప్రేక్షకులు నెత్తిన పెట్టుకుంటారు. అదే బాగాలేదు అని అంటే.. ఇక అంతే సంగతులు. మినిమమ్ కలెక్షన్స్ కూడా రావు. ఇది ఒక్క బాలయ్యకే కాదు. చాలామంది సీనియర్ హీరోలది ఇదే పరిస్థితి. సినిమా జ‌యాప‌జ‌యాలు ఎవ‌రి చేతుల్లోనూ ఉండ‌వు. అవి క‌చ్చితంగా ప్రేక్ష‌కులు ఇచ్చే తీర్పుపైనే ఆధార‌ప‌డి ఉంటుంది. కానీ మా సినిమా సూపర్ హిట్ట‌వుతుంది అని గుడ్డిగా న‌మ్మ‌డమే పెద్ద తప్పు.

భ‌గ‌వంత్ కేస‌రి సినిమా గురించి ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి – బాలయ్య మాటల్లో ఇప్పుడు అతి వినిపిస్తోంది. ప్ర‌తి ఒక్కరికీ మంచి సినిమా ఇవ్వాల‌న్న‌దే తాప‌త్ర‌యం. అనిల్ అయినా, బాలయ్య అయినా హిట్టు అవుతుంద‌నే సినిమాలు తీస్తారు. అందులో నో డౌట్. కానీ, తమ సినిమా గురించి అనవసరమైన బిల్డప్ లు ఇస్తే.. అది సినిమాకే చేటు అని అర్థం చేసుకోలేకపోతే ఎలా ?, అసలు ఫ్లాపుల కోసం ఎవ‌రూ ఏళ్ల‌కు ఏళ్లు శ్ర‌మించ‌రు అనేది ప్రేక్షకులకు తెలీదా ఏమిటి ?, ఇప్పటి ప్రేక్షకులకు అన్ని తెలుసు. డబ్బులు ఇచ్చి రివ్యూలు పాజిటివ్ గా రాయించినా, ప్రేక్షకులు కలెక్షన్స్ ను ఇవ్వడం లేదు.

ఏతావాతా చెప్పొచ్చేది ఏమిటంటే.. నేనో గొప్ప హీరోని, లేదా నేనో గొప్ప దర్శకుడిని.. మేం గొప్ప క్లాసిక్ సినిమా ఇస్తున్నాం, ప‌రిశ్ర‌మ గుర్తుండిపోయే సినిమా చేశాం.. మా సినిమా చూడటం మీ అదృష్టం.. లాంటి ఓవర్ యాక్షన్ మాటలను చెప్పకుండా అటు బాలయ్య బాబు అయినా, ఇటు అనిల్ రావిపూడి అయినా తమ సినిమాని ప్రమోట్ చేసుకుంటే.. అది ‘భ‌గ‌వంత్ కేస‌రి’ సినిమాకే మేలు చేస్తోంది. ఆ దిశగా వారిద్దరూ ఆలోచిస్తారు అని ఆశిద్దాం. అయినా, భ‌గ‌వంత్ కేస‌ర పాట‌లు, ప్రోమోలూ అన్నీ సినిమా చూడాల‌న్న కుతూహ‌లం పెంచుతున్నాయి అంటున్నారు గానీ, నిజంగా ఆ కుతూహ‌లం అయితే ఏమీ లేదు.

Also Read:రాజశేఖర్ అందుకే ఒప్పుకున్నాడట

- Advertisement -