భగవంత్ కేసరి..సింగిల్ కట్ లేకుండా

23
- Advertisement -

అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం భగవంత్ కేసరి. ఈ నెల 19న సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండగా భారీ అంచనాలు పెట్టుకున్నారు బాలయ్య. ఇక ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేయగా బాలకృష్ణ మాటలు తూటాల్లా పేలుతున్నాయి.

తాజాగా ఈ మూవీ సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్‌ బోర్డ్‌ క్లీన్ యూ/ఏ సర్టిఫికెట్‌ను జారీ చేసింది. భగవంత్ కేసరి రన్‌ టైం 164 నిమిషాలు (2 గంటల 44 నిమిషాలు) కాగా.. సింగిల్ కట్ లేకుండా ఓకే చెప్పేసింది. దీంతో చిత్రయూనిట్ ఫుల్ జోష్ మీదుంది.

అక్టోబర్‌ 18న యూఎస్‌ఏలో గ్రాండ్‌ ప్రీమియర్స్ వేయనున్నారు. ఈ చిత్రాన్ని ఓవర్సీస్‌లో పాపులర్ లీడింగ్ డిస్ట్రిబ్యూషన్‌ హౌజ్‌ సరిగమ సినిమాస్ విడుదల చేయనుంది. బాలయ్య సరసన కాజల్ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా శ్రీలీల కీలక పాత్ర పోషిస్తోంది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్‌గా నటిస్తున్నాడు.

Also Read:బాలయ్య.. ఈ అతి అవసరమా?

- Advertisement -