శనగలను మంచి పౌష్టికాహారంగా పరిగణిస్తుంటారు ఆహార నిపుణులు. ఎందుకంటే శనగలలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. అంతే కాకుండా విటమిన్లు, మరియు సూక్ష్మ పోషకాలు కూడా మెండుగా ఉంటాయి. శనగలను రకరకాలుగా తింటూ ఉంటారు. ఉడికించి గుగ్గిల రూపంలోనూ, నానబెట్టి మొలకల రూపంలోనూ, ఇంకా స్నాక్స్ గాను తింటూ ఉంటారు. శనగలను ఎలా తిన్న శరీరానికి అందవలసిన పోషకాలు సమృద్దిగా అందినప్పటికి ఉడికించి తింటే ఇంకా ఎక్కువ లాభాలు ఉంటాయని న్యూట్రీషియన్స్ చెబుతున్నారు. ఉడికించడం వల్ల అందులోని పోషకాలు పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం వంటివి ఇంకా మెరుగుపడతాయని నిపుణులు చెబుతున్నా మాట.
అందుకే వారానికి కనీసం రెండు సార్లు అయిన ఉడికించిన శనగలు తింటే మేలట. ముఖ్యంగా శనగల్లో ఉండే పోషకాలు రక్తపోటును అదుపులో ఉంచుతాయట. ఇంకా శనగల్లో ఉండే పీచు పదార్థం జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తుంది. అంతే కాకుండా శనగల్లో కొలెస్ట్రాల్ ను తగ్గించే గుణాలు కూడా ఉంటాయి. ఇక బరువు పెరగాలనుకునే వారికి శనగలు మంచి ఆహారమని నిపుణులు చెబుతున్నారు ముఖ్యంగా నాన్ వెజ్ తినని వారికి శనగలు నాన్ వెజ్ తో సమానమైన ప్రోటీన్లను అందిస్తాయట.
రక్తంలో ఎర్ర రక్తకణాలను పెంచడంలో కూడా శనగలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఇంకా ఇందులోని కాల్షియం ఎముకల పటుత్వాన్ని పెంచుతుంది. ఇంకా బరువు తక్కువగా ఉన్నవారు ప్రతిరోజూ ఉడకబెట్టిన శనగలు తింటే త్వరగా బరువు పెరిగే అవకాశం ఉంది. అయితే శనగల వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నప్పటికి.. వాటిని తినడంపై తగు జాగ్రత్తలు పాటించాలని ఆహార నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వీటిని ఎక్కువగా తినడం వల్ల కడుపు ఉబ్బరంగా మరే అవకాశం ఉంది. తద్వారా గ్యాస్ సమస్యలు ఏర్పడతాయి. ఇంకా శనగలు అతిగా తింటే విరోచనాల బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి శనగలు పౌష్టికాహారం అయినప్పటికి వీటిని తగు మాత్రమే తినాలని నిపుణులు చెబుతున్నారు.
Also Read:యాలకుల రసంతో ఉపయోగలెన్నో..!