యాలకుల రసంతో ఉపయోగలెన్నో..!

11
- Advertisement -

మనదేశంలో అత్యంత విరివిగా ఉపయోగించే సుగంధ ద్రవ్యాలలో యాలకులు ముందు వరుసలో ఉంటాయి. ఎలాంటి వంటకమైన అందులో యాలకులు వేస్తే చక్కని సువాసన, అమోఘమైన రుచి లభిస్తుంది., అందుకే మసాలా దినుసుల్లో యాలకులను తప్పనిసరిగా ఉపయోగిస్తారు. ఇంకా స్వీట్స్ తయారీలోనూ బేకరీ ఐటమ్ లలోనూ ఉపయోగిస్తుంటారు. యాలకులలో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, ఫాస్ఫరస్.. ఇలా ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఆరోగ్యనికి ఎంతో మేలు చేస్తాయి. యాలకులను ఆయుర్వేదంలో కూడా వివిధ ఔషధలా తయారీలో ఉపయోగిస్తారు. ఎన్నో ఆరోగ్య సమస్యలను దూరం చేయడంలో యాలకులు ఎంతగానో ఉపయోగ పడతాయట.

అయితే నేరుగా యాలకులను తినడం కంటే కూడా నీటి రూపంలో సేవించడం మరి మంచిది. ఒక గిన్నెలో తగినన్ని నీరు తీసుకొని ఆ నీటిలో కొన్ని యాలకులు వేసి బాగా మరిగించి గోరు వెచ్చగా ఉన్నప్పుడూ ఆ నీరు త్రాగితే ఎంతో మేలని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇలా ప్రతిరోజూ చేయడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగు పడుతుందట. ఇంకా కడుపులో మంట, ఎసిడిటీ, అజీర్తి వంటి సమస్యలను కూడా దూరం చేస్తుందట. కఫం, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలను కూడా యాలకుల రసం దూరం చేస్తుంది. ఇంకా రక్తంలో షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచుతుంది. మూత్రంలో మంట, మూత్రం రంగు మారడం వంటి సమస్యలను దూరం చేస్తుంది. శరీరంలో క్యాన్సర్ కారకాలను దూరం చేయడంలో కూడా యాలకుల రసం ఎంతగానో ఉపయోగ పడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ప్రతిరోజూ యాలకుల రసం తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్న మాట.

Also Read:టిల్లు కోసం వస్తున్న దేవర!

 

- Advertisement -