May Day:ఆటో నడిపిన హరీష్

17
- Advertisement -

అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా అందరికి విషెస్ తెలిపారు మాజీ మంత్రి హరీష్ రావు. శ్రమిద్దాం.. శ్రమని గౌరవిద్దాం. చెమట చుక్క విలువను కాపాడుకుందాం. కలిసి కట్టుగా మన హక్కులపై పోరాడుదాం అని కార్మిక లోకానికి మే డే విషెస్ తెలిపారు. ఈ పోస్టుతోపాటు తాను ఆటోవాలా అంగీ వేసుకుని ఆటో నడిపిన ఫొటోను షేర్‌ చేశారు.

అదేవిధంగా కార్మికులకు సంబంధించి..

కమ్మరి కొలిమి, కుమ్మరి చక్రం,
జాలరి పగ్గం, సాలెల మగ్గం,
శరీర కష్టం స్ఫురింపజేసి
గొడ్డలి, రంపం, కొడవలి, నాగలి
సహస్రవృత్తుల సమస్త చిహ్నాలు
నా వినుతించే, నా విరుతించే
నా వినిపించే నవీనగీతికి
నా విరచించే నవీన రీతికి
భావం, భాగ్యం, ప్రాణం, ప్రణవం
అంటూ ‘శ్రీ శ్రీ’ రాసిన కవితను హరీశ్‌రావు జతచేశారు.

camp%5Etweetembed%7Ctwterm%5E1785517634152497348%7Ctwgr%5Ef9f86c42e2fcc912ede381ff369f24549d6dcdbc%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.ntnews.com%2Ftelangana%2Fbrs-leader-harish-rao-says-may-day-greetings-to-people-1568662

- Advertisement -