- Advertisement -
నిరుపేద పద్మశాలిలకు డబుల్ బెడ్‌రూంలు అందజేస్తామని మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. సిద్ధిపేట జిల్లాకేంద్రంలోని వడ్డేపల్లి దయానంద్ గార్డెన్స్‌లో సిద్ధిపేట జిల్లా పద్మశాలీ సంఘం నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. పద్మశాలిలా కోసం ప్రభుత్వ తరఫున రావాల్సిన సంక్షేమ పథకాలను అందిస్తామని హామీ ఇచ్చారు.
పద్మశాలి సమాజం అభివృద్ధి కోసం తనవంతు కృషి చేస్తానని తెలిపారు. పద్మశాలిలు రాజకీయంగా, ఆర్థికంగా మరింత ఎదగాలన్నారు. సీఎం కేసీఆర్ పద్మశాలి సమాజం కోసం పరితపించే గొప్ప వ్యక్తన్నారు. పద్మశాలి సమాజం కోసం ఉద్యమించిన కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహాలను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నారన్నారు.పద్మశాలి సంఘం అధ్యక్షుడు డాక్టర్ సతీశ్ ధన్యవాదాలు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
- Advertisement -