కాంగ్రెస్ అగ్రనేత,ఎంపీ రాహుల్ గాంధీపై తీవ్రస్ధాయిలో మండిపడ్డారు మంత్రి హరీశ్ రావు. రాహుల్ ఓ అజ్ఞాని అని..అసలు కాళేశ్వరం ప్రాజెక్టుకు ఖర్చు చేసిందే రూ.80 వేలు అయితే లక్ష కోట్ల అవినీతి ఎలా జరిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందనడం సరికాదన్నారు. కాళేశ్వరం పూర్తయితేనే కదా యాసంగిలో అంత పంట పండింది అని హరీశ్‌రావు గుర్తు చేశారు.
సిద్దిపేట కేంద్రంలోని పత్తి మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన తుంపర సేద్య పరికరాల పంపిణీ, ఆయిల్ పామ్ సాగు అవగాహన సదస్సులో పాల్గొన్న హరీష్…కాంగ్రెస్ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఖండించారు. వర్షాభావ పరిస్థితులు తలెత్తితే కాలేశ్వరం ద్వారా రైతులకు నీళ్లు ఇవ్వాలని సీఎం కేసీఆర్ సూచించారని హరీశ్‌రావు పేర్కొన్నారు.
Also Read:మరోసారి విక్రమ్ కాంబో రిపీట్!
రైతులు ఇబ్బంది పడొద్దు అని సీఎం చెప్పారని దానికి అనుగుణంగానే వ్యవసాయానికి సరిపడా నీరందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. వ్యవసాయ బావుల వద్ద ఒక్క మీటర్ మీద రూ. 25,000 కరెంట్ బిల్లును ప్రభుత్వం భరిస్తుందన్నారు.
Also Read:బర్త్ డే..మొక్కలు నాటిన బొంతు రామ్మోహన్