Harish:అత్యాధునిక టెక్నాలజీతో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ

19
- Advertisement -

సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట గ్రామంలో నిర్మిస్తున్న పామాయిల్ ఫ్యాక్టరీ పనులను పరిశీలించారు మాజీ మంత్రి హరీష్ రావు. టీఎస్ ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ పనులు వేగంగా చేయాలని, త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులను అదేశించాం అన్నారు. అత్యాధునిక టెక్నాలజీ,అన్ని వసతులతో కూడిన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ని మన నర్మెట లో నిర్మించడం జరుగుతుందన్నారు.

ఈ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ లో నూనె ఉత్పత్తి చేయడమే కాదు రిపైనరీని పెట్టి ఫైనల్ ప్రొడక్ట్ ను ఇక్కడ నుండే నేరుగా మార్కెట్ లోకి పంపించడం జరుగుతుందని…దీనికి కావాల్సిన 4 మెగా వాట్ల సెల్ఫ్ జనరేషన్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. వాడిన నీటిని వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా రి సైకిల్ చేసే పద్ధతిని ఇక్కడ పెట్టుకోవడం జరిగిందన్నారు.

గత మూడు సంవత్సరాల క్రితం ఆయిల్ పామ్ పంటను పెట్టిన రైతుల నుండి ఈ జూన్ వరకు పంట దిగుబడి రానుందని…రానున్న జూన్ మాసం అంటే 5 నెలల్లో పంట ఉత్పత్తి ప్రారంభం కానుంది కనుక దాన్ని కొనుగోలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులు పండించిన ఆయిల్ పామ్ కు సంబంధించిన రవాణా ఖర్చును మీ వ్యవసాయ భూమి నుండి నర్మెట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ వరకు పామయిల్ ఫ్యాక్టరీ నే చెల్లిస్తుందన్నారు.

Also Read:Chiru:ఈ గౌరవం మీదే

- Advertisement -