Harishrao:గీత సొసైటీలతో గౌడన్నల అభివృద్ధి

19
- Advertisement -

గీత కార్మిక సహకార సొసైటీలు ఉంటే గౌడ జాతి అభివృద్ధి చెందుతుందన్నారు మంత్రి హరీష్ రావు శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ తో కలిసి 6 కోట్ల రూపాయల నిధులతో నిర్మించిన శ్రీమహారేణుక (ఎల్లమ్మ) తల్లి గౌడ ఏసీ కన్వీన్షన్ సెంటర్ ను ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. గౌడ కులస్తులు ఉచితంగా, సౌకర్యవంతంగా శుభకార్యాలు నిర్వహించుకునేందుకు 6 కోట్ల రూపాయలతో ఏసీ కన్వెన్షన్ సెంటర్ ను నిర్మించడం జరిగిందన్నారు.

హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో 12 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన నీరా కేఫ్ లాగా అన్ని జిల్లా కేంద్రాలలో నీరా కేఫ్ లను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామన్నారుజ ఉమ్మడి రాష్ట్రంలో ఎక్సైజ్ శాఖ వారి దాడులతో మరియు చెట్టు పన్నుతో ఇబ్బందులకు గురవడమే కాకుండా, గీత కార్మిక సొసైటీలను రద్దు చేసి ఇబ్బందులకు గురి చేయగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడగానే సీఎం కేసీఆర్ గీత పారిశ్రామిక సంఘాలను పునరుద్ధరించి చెట్టు పన్నును రద్దు చేశారన్నారుజ

లంచం కోసం ఆనాటి పాలకులు మరియు అధికారులు కల్లు డిపోలను మూసి వేయగా, నేడు ప్రభుత్వం మద్యం దుకాణాలలో గౌడ కులస్తులకు రిజర్వేషన్ కల్పించిందన్నారు. గౌడ జాతి గౌరవం పెంచేలా సర్దార్ పాపన్న జయంతి మరియు వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. మూడు కోట్ల రూపాయలతో ట్యాంక్ బండ్ పై సర్దార్ పాపన్న విగ్రహాన్ని సీఎం నెలకొల్పుతున్నారని చెప్పారు. సిద్దిపేట పట్టణంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయ పునరుద్ధరణ కోసం సహకారం అందిస్తానని చెప్పారు.

Also Read:యాక్షన్‌ డ్రామా నేపథ్యంలో ‘జితేందర్ రెడ్డి’

- Advertisement -