వరుణ్ తేజ్ హీరోగా దర్శకుడు హరీష్ శంకర్ వాల్మీకి చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. ఇటివలే ఈమూవీ పూజా కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. 2014లో తమిళంలో విజయం సాధించిన జిగర్తాండ మూవీని రిమేక్ చేయనున్నాడు. తమిళంలో బాబీసింహా చేసిన పాత్రలో వరుణ్ తేజ్ చేయగా..సిద్దార్ద్ పాత్ర కోసం మరో హీరోను వెతికే పనిలో ఉన్నాడు హరీష్ శంకర్.
తాజాగా ఉన్న సమాచారం ప్రకారం సిద్ధార్ద్ పాత్రలో హీరో శ్రీ విష్ణును ఖరారు చేసినట్టు తెలుస్తుంది. శ్రీవిష్ణు హీరోగా నటించిన నీది నాదీ ఒకే కథ, మెంటల్ మదిలో సినిమాలు మంచి విజయం సాధించాయి. అంతేకాకుండా ఉన్నది ఒకటే జిందగి సినిమాలు రామ్ ఫ్రెండ్ గా నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఇద్దరు హీరోలు ఫిక్స్ కావడంతో హీరోయిన్ లను వెతికే పనిలో ఉన్నాడు దర్శకుడు హరీష్ శంకర్. త్వరలోనే ఈచిత్రినికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం. 14 రీల్స్ ఎంటటైన్ మెంట్ సంస్థ నిర్మించే ఈసినిమా రెగ్యూలర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభంకానున్నట్లు తెలుస్తుంది.