- Advertisement -
కరవు ప్రాంతంగా ఉన్న తెలంగాణకు గోదావరి నీళ్లతో ప్రజల కాళ్లు కడిగి కష్టాలు తీర్చాలన్న తపనతో కాళేశ్వరం ప్రాజెక్టు పనులు మహా యజ్ఞం మాదిరి చేపట్టామని రాష్ట్ర మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం సిద్ధిపేట జిల్లాలోని చంద్లాపూర్ ప్రాంతంలో నిర్మిస్తున్న రంగనాయకసాగర్ రిజర్వాయర్ పనులను రెండో రోజు పరిశీలించారు మంత్రి హరీష్ రావు.
ఈసందర్భంగా మంత్రి బైక్‌పై ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. బుల్లెట్‌పై తిరుగుతూ… కాలువ పనులు ఎక్కడి వరకు వచ్చాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల నుంచి వెళుతున్న కెనాల్‌తో రైతులకు కలిగే లాభాలను మంత్రి వివరించారు. కెనాల్ నుంచి నీటిని చెరువులకు అనుసంధానంపై మంత్రి అధికారులకు సూచించారు.
- Advertisement -