హ్యాపీ బర్త్ డే … వరుణ్ తేజ్

156
happy birthday varun tej

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తక్కువ కాలం లో, విన్నూత్నమైన సబ్జక్ట్స్ ఎంచుకుంటూ తనదైన ఐడెంటిటీ సంపాదించుకున్నారు. అటు యువతను ఇటు ఫామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకుంటు విభిన్న కథలతో ముందుకు వెళుతున్నాడు. లేటుగా వచ్చినా, తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు వరుణ్ తేజ్. మెగాబ్రదర్ నాగబాబు వారసుడిగానే కాక, మొత్తం ఫ్యామిలీలోనే అందగాడు అంటూ మెగాస్టార్ తోనే అనిపించుకున్నాడు ఈ ఆరడుగుల అందగాడు.

2000లో బాలనటుడిగా హ్యాండ్సప్ సినిమాలో నటించాడు. శివ నాగేశ్వరరావు డైరెక్షన్ లో వచ్చిన ఆ సినిమాలో వరుణ్ తన పేరుతో ఉన్న పాత్రే వేశాడు. ఆ తర్వాత 14 ఏళ్ల పాటు ఏ సినిమా కూడా చేయలేదు. బాల్యం నుంచి యుక్తవయస్కుడిగా మారిన తర్వాత వరుణ్ 2014లో ముకుంద సినిమాతో హీరో అయ్యాడు. శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో వచ్చిన ముకుంద వరుణ్ కు బాగా కలిసొచ్చింది. హిట్ టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత వరుణ్ కు ఓ అద్భుతమైన అవకాశం వచ్చింది. రెండో ప్రపంచయుద్ధం నేపథ్యంలో తీసిన కంచె సినిమాలో వరుణ్ తేజ్ అద్భుత నటనతో ఆకట్టుకున్నాడు. కంచె సినిమాతో రెండో సక్సెస్ సాధించాడు. అన్నింటికంటే ముఖ్యమైన విశేషమేమంటే, ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కావడంతో పాటు జాతీయ అవార్డు కూడా తెచ్చుకుంది.

happy birthday varun tej

లోఫర్ సినిమాతో మాస్ హీరో గా.. అమ్మ ప్రేమ కోసం తపన పడే వ్యక్తిగా ఆకట్టుకొన్నాడు..1990 జనవరి 19న వరుణ్ తేజ్ పుట్టాడు వరుణ్ తేజ్.  శ్రీనువైట్ల ద‌ర్శ‌క‌త్వంలో మిస్ట‌ర్ , శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఫిదాతో మెప్పించాడు. ప్రస్తుతం వరుణ్ తొలి ప్రేమ ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆయన ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని greattelangaana.com కోరుకుంటోంది.