రైతులకు భరోసాగా తెలంగాణ ప్రభుత్వం..

304
harish rao
- Advertisement -

రైతులకు భరోసాగా తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టిందని తెలిపారు మంత్రి హరీష్ రావు. సంగారెడ్డి జిల్లాలో నియంత్రిత వ్యవసాయ సాగు విధానం పై జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు, ఎంపీలు కొత్త ప్రభాకర్ రెడ్డి, బి. బి. పాటిల్, జిల్లా ఎమ్మెల్యేలు, రైతు సమితి నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్….కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసిందని…ఏనాడూ రైతుల గోసను పట్టించుకోలేదన్నారు. దేశంలోనే రైతు కేంద్రం గా ప్రభుత్వం నడుపుతున్న రాష్ట్రం కేవలం తెలంగాణనే అన్నారు.

రైతుల సంక్షేమ కోసం ప్రభుత్వ శాఖలు పనిచేస్తున్నాయని…రైతుల ఆర్ధికంగా ఎదగడానికి తెలంగాణ ప్రభుత్వం నియంత్రిత వ్యవసాయ సాగు విధానం ను టీ ఆర్ ఎస్ ప్రభుత్వం తీసుకువస్తుందన్నారు.

మార్కెట్ కు అనుగుణంగా డిమాండ్ ఉన్న పంటల సాగును రైతులు చేయాలన్నారు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి. కాంగ్రెస్ నాయకులు రైతులకు భ్రమలు కల్పించాలని చూస్తున్నారని….వారిని పట్టించుకోవద్దన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల్లో కి వెళ్లి రైతులతో మాట్లాడి …లాభసాటి పంటల సాగు దిశగా ప్రోత్సహించాలన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయి లో పనిచేసి…రైతులకు అండగా ఉండాలన్నారు.

- Advertisement -