ప్రభుత్వ మెడికల్ కాలేజీకి వైద్య పరికరాలను అందించిన మంత్రి..

32
harish

ప్రతి మనిషి కూడా జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే సంకల్పం ఉండాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని తన నివాసంలో వీ లవ్‌ యూ ఫౌండేషన్‌ వారి సహకారంతో సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీకి వైద్య పరికరాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ సమాజం నాకేమిచ్చింది ఈ ప్రభుత్వం నాకేమిచ్చింది మా తల్లిదండ్రులు నాకు ఏమి ఇచ్చారు అని అనుకోవద్దు. నేను ఈ సమాజానికి ఏమి ఇచ్చాను అని ప్రతి ఒక్కరు ఆలోచించాలి.

జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, పుట్టిన నేలకి ఏదో ఒక సేవ చేయాలని మంత్రి హితవు పలికారు. వి లవ్ యు ఫౌండేషన్‌ను అందరూ ఆదర్శంగా తీసుకోవాలి. సామాజిక సేవ చేయడానికి డబ్బు అవసరం లేదు చేయాలనే సంకల్పం కావాలి. పిల్లలకు సామాజిక స్పృహ పాఠశాల నుండి మొదలవ్వాలని నాకనిపిస్తుంది. మార్పు అనేది చిన్నప్పటినుండి మొదలైతే సమాజానికి ఎంతో మంచిదని మంత్రి హరీష్‌ పేర్కొన్నారు.