టీఆర్ఎస్ … తెలంగాణ ఇంటిపార్టీ: మంత్రి హరీష్

357
harish rao
- Advertisement -

సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ దేశానికే దిక్సూచిగా నిలిచిందని తెలిపారు మంత్రి హరీష్ రావు. మెదక్ జిల్లా చిన్న శంకరం పేట మండల కేంద్రంలో అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించి ,పార్టీ జెండాను ఆవిష్కరించారు హరీష్.

ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్‌..14 ఏళ్ల పోరాటం, ఆరేళ్ల పరిపాలన ఆనాటి జలదృశ్యం నుంచి నిన్నగాక మొన్న ఆవిష్కరించబడ్డ రంగ నాయక సాగర్ వరకు తెలంగాణ ప్రస్థానం ప్రజలకు కనిపిస్తూనే ఉందన్నారు.

ఆనాడు ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాలు ఏ నీళ్ల కోసం టిఆర్ఎస్ పార్టీ పోరాడిందో ఆ నీళ్లను సాధించిన పార్టీ టిఆర్ఎస్ పార్టీ అన్నారు. 2001లో జలదృశ్యం లో ప్రారంభమైన టి ఆర్ ఎస్ ప్రస్థానం ఎన్నో పోరాటాలు, ఎన్నో త్యాగాలు, ఎన్నో ఉద్యమాలతో రాష్ట్రాన్ని సాధించిందని చెప్పారు.

సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రొఫెసర్ జయశంకర్ విద్యాసాగర్ ఎంత మంది నాయకులు అంచెలంచెలుగా పోరాటం చేసి చివరికి కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి ప్రాణత్యాగానికి సిద్ధపడి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి డిసెంబర్ 9 2009 తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాం అన్నారు.

సీఎం కేసీఆర్ అకుంఠిత దీక్షతో నిరంతరం ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా స్వీకరిస్తూ త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రం సాధించాం..ఏ అసెంబ్లీలో తెలంగాణ పదాన్ని నిషేధించారో అసెంబ్లీలోనే తెలంగాణకు అనుకూలంగా తీర్మానం తెచ్చిందో అదే టిఆర్ఎస్ పార్టీ అన్నారు. మనం చేస్తున్న పరిపాలన సంక్షేమం అభివృద్ధి దేశానికి ఆదర్శంగా నిలిచి గర్వపడే దిశగా కొనసాగుతుందన్నారు.
ఇప్పటికి అనేక ప్రాజెక్టులు నిర్మాణం పూర్తయ్యాయి మరిన్ని ప్రాజెక్టులు నిర్మించి కోటి ఎకరాల మాగాణి గా అష్ట శ్యామల తెలంగాణగా మార్చుకునే దిశగా టీఆర్ఎస్ కృషి చేస్తుందన్నారు.

ప్రజల సంక్షేమం, ప్రజల ఆలోచనలు, ప్రజల మనోభావాలు గౌరవించే పార్టీ టిఆర్ఎస్ పార్టీ అన్నారు. తెలంగాణలో ఇంటి పార్టీగా నిలిచిపోయింది టిఆర్ఎస్ అన్నారు.

- Advertisement -