దేశానికే దిక్సూచిగా తెలంగాణ : మంత్రి జగదీష్‌ రెడ్డి

297
minister jagadish
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర సమితి దేశ రాజకీయాలలోనే సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలిచిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. వయసు తక్కువే అయిన పరిణితి తో పనిచేసినందునే అద్భుత విజయాలు టీఆర్ఎస్ పార్టీ సొంతం చేసుకుందని ఆయన చెప్పుకొచ్చారు.

టి ఆర్ యస్ పార్టీ ఆవిర్భవించి 19 వసంతాలు పూర్తి చేసుకుని 20 వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా సోమవారం ఉదయం నల్గొండ జిల్లా కేంద్రంలో నీ టి ఆర్ యస్ పార్టీ కార్యాలయంలో ఆయన పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ సమకాలీన రాజకీయాలలో తిరుగులేని నేతగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిలిచారని ఆయన ప్రశంసించారు.మూడున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష ను సాధించిన నేతగా భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తో అభినందించబడిన ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం కోసం ఇప్పుడు యావత్ భారతదేశం ఎదురు చూస్తుందన్నారు.
సరిగ్గా 19 సంవత్సరాల క్రితం జలదృశ్యంలో గులాబీ పార్టీ పురుడు పోసుకుంటున్న సమయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట ఐదు వెల మంది తెలంగాణ సాధిస్తామన్న ధైర్యం తో అడుగు వేశారని….అదే సమయంలో మఖలో పుట్టి పుబ్బలో పోతుందంటూ అవహేళనలు,వెట కారాలు చేసిన ఉదంతాలని ఆయన ఈ సందర్భంగా ఉటంకించారు.

ఆటువంటి అవహేళనలను,వెట కారలను, చిదరింపులను పటాపంచలు చేస్తూ రాష్ట్రాన్ని సాధించిన పార్టీ గా తెలంగాణా సాధించిన నేత గా ముఖ్యమంత్రి కేసీఆర్ చరిత్ర సృష్టించారని మంత్రి జగదీష్ రెడ్డి కొనియాడారు.

ఆ రోజున అహంకారం తో గెలి చేసిన చంద్రబాబు పార్టీ కార్యాలయానికి తెలంగాణా లో తాళం వేసుకున్నారని….అంతకు మించి అహంకారం తో విర్రవీగిన కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్ కు తాళం పడ్డ విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా అధికారాన్ని చేబూని నవసమజ నిర్మాణానికి నాంది పలికింది ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆయన అన్నారు.

ఇప్పుడు అదే గులాబీ పార్టీ యావత్ భారతదేశానికి దిక్సుచి గా మారిందన్నారు.పాలన ప్రారంభమైన పది నెలల్లోనే సంచలన విజయాలు నమోదు చేసుకోవడమే అందుకు కారణమన్నారు.బట్టలు అరేసుకోవడానికే కరెంట్ తీగలు అన్న చీత్కారపు మాటలను తిప్పి కొట్టడమే కాకుండా 24 గంటల నిరంతర నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా కు శ్రీకారం చుట్టడమే కాకుండా యావత్ భారతదేశంలో అమలు పరుస్తున్న ఏకైక ప్రభుత్వం టి ఆర్ యస్ దే నని అందుకు గర్వపడుతున్నామన్నారు.అది సాధించిన ఘనత ముమ్మాటికి ముఖ్యమంత్రి కేసీఆర్ దే నన్నారు.

కలలోకూడ ఊహించనటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించి ప్రారంభించి తెలంగాణ రాష్ట్రాన్ని దాన్యాబండాగారాం మార్చిన శిల్పి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ యే నని ఆయన చెప్పారు. వ్యవసాయశాఖ చరిత్రలోనే సరికొత్త రికార్డ్ సృష్టించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కు,టి ఆర్ యస్ పార్టీ ప్రభుత్వానికి దక్కిందన్నారు. అటువంటి సమర్థవంతమైన నేతగా రాణించిన ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం కోసం ఇప్పుడు యావత్ భారతప్రజానీకం ఎదురు చూస్తుందన్నారు.

వాస్తవానికి అద్భుత విజయాలు సాధించిన పార్టీగా టి ఆర్ యస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాల్సిన సందర్భం ఉండేదని అయితే ప్రపంచాన్ని అతులాకుతులం చేస్తున్న కరోనా వైరస్ తో ఆంక్షల నడుమ సాదా సీదా గా చేసుకోవలసిన పరిస్థితి ఏర్పడిందన్నారు.

భవిష్యత్ లో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచి టి ఆర్ యస్ పార్టీనీ ఆశీర్వదిస్తే మరిన్ని సంచలన విజయాలు నమోదు చేసుకోవచ్చని మంత్రి జగదీష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి,నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య, నల్గొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి,జిల్లా గ్రంధాలయా సంస్థ అధ్యక్షుడు రేఖల భద్రాద్రి,ఐ సి డి యస్ రీజనల్ కో ఆర్డినేటర్ మాలే శరణ్యా రెడ్డి,మాజీ యం ఎల్ సి పూల రవిందర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -