జెర్సీ హీరో పెళ్లి.. వధువు ఎవరంటే ?

186
- Advertisement -

హరీష్ కళ్యాణ్.. కోలీవుడ్‌కి యంగ్ హీరోల్లో తనకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది..తమిళ్ బిగ్ బాస్ ఫస్ట్ సీజన్‌లో పార్టిసిపెట్ చేసిన హరీష్.. తర్వాత ‘సింధు సమవేలి’ మూవీతో యాక్టర్‌గా ఇంట్రడ్యూస్ అయ్యాడు. కొద్దిరోజుల క్రితం నర్మద ఉదయ్ కుమార్‌తో తనకు నిశ్చితార్థం జరిగిందని సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేశాడు హరీష్.

చెన్నైకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త నర్మదా ఉదయకుమార్‏తో ఏడు అడుగులు వేశాడు. నేడు వీరి పెళ్లి చెన్నైలోని తిరువెర్కాడులోని జీపీఎన్ ప్యాలెస్ లో ఘనంగా జరిగింది. ఇక తాళి కట్టేటప్పుడు నర్మదా ఆనందంతో కన్నీళ్లు పెట్టుకోవడం చూపరులను ఆకట్టుకొంది. అప్పట్లో వీరిది లవ్ మ్యారేజ్ అని వార్తలు రావడంతో.. వాటిని ఖండిస్తూ తమది పెద్దలు కుదిర్చిన పెళ్లేనని కన్ఫమ్ చేశాడు. ఆయన వైఫ్ నర్మదా విషయానికొస్తే.. తనకి ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధం లేదు. చెన్నైకి చెందిన యువ పారిశ్రామికవేత్త అయిన నర్మదా.. ‘క్లిక్ డిజైన్స్’, ‘దిస్ ఈజ్ హెర్’ అనే రెండు సంస్థలకు మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తోంది.

- Advertisement -