మహేష్ బాబు అరుదైన రికార్డ్

111
- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫాలోయింగ్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. మహేశ్ కు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఇతర రాష్ట్రాల్లోనూ మంచి క్రేజ్ ఉంది. పాన్ ఇండియా సినిమా చేయకుండానే జాతీయ స్థాయిలో పాపులారిటీ సంపాదించుకున్నాడు. . ప్రస్తుతం ఈయన త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. ఇక ఈ చిత్రం సెట్స్‌ పైన ఉండగానే.. రాజమౌళి సినిమా కోసం ఇప్పటి నుండే కసరత్తులు చేస్తున్నాడు. మహేష్ తాజాగా అరుదైన రికార్డు క్రియేట్‌ చేశాడు.

లేటెస్టుగా ట్విట్టర్ లో మహేష్ బాబు ని అనుసరించే వారి సంఖ్య 13 మిలియన్లు దాటింది. సౌత్‌లో అత్యధిక ఫాలోవర్స్‌ ఉన్న నటుడిగా అరుదైన ఘనత సాధించాడు.. 2010 ఏప్రిల్ లో మహేష్ ట్విట్టర్ ఖాతాను ఓపెన్ చేసారు. ఇప్పటి వరకూ ఆయన 30 మందిని మాత్రమే అనుసరిస్తుండగా.. అందులో 10 మంది సినీ ప్రముఖులు ఉన్నారు. క ఇన్స్టాగ్రామ్ లో ప్రిన్స్ కు 9 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. తర్వాతి స్థానాల్లో ధనుష్ సూర్య ఉన్నాడు. టాలీవుడ్‌ నుండి అల్లు అర్జున్‌ 5వ స్థానంలో ఉన్నాడు.

 

ఇవి కూడా చదవండి

కాంతార తగ్గేదెలె..! కార్తికేయ-2 రికార్డ్ బ్రేక్

సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి

కిషన్ రెడ్డి, బండి సంజయ్ పై ట్రోల్స్

- Advertisement -