బాత్‎రూమ్‎లో హార్ధిక్, ధావన్ డ్యాన్స్.. వైరల్..

237
hardik-pandya-and-shikhar-dhawan

భారత క్రికెటర్లు హార్దీక్, ధావన్ మైదానంలోనే కాకుండా.. బయట కూడా అలరిస్తుంటారు. వీరిద్దరూ ఎప్పుడు కలిసినా.. పాటలు పాడుతూ.. డ్యాన్స్ చేస్తూ సందడి చేస్తారు. తాజాగా వీరిద్దరు డ్యాన్స్ చేసిన ఒక వీడియో నెటింట్లో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోని హార్దిక్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు. నేను, జట్టా డ్యాన్స్ చేస్తూ దొరికిపోయాం. మాకు పాటలు పాడటం, డ్యాన్స్ చేయడం అంటే చాలా ఇష్టం అంటూ క్యాప్షన్ కూడా పెట్టాడు.

hardik-shikhar

బాత్ రూమ్ లో అద్దంముందు నిలబడి ఈ ఇద్దరు చేసిన డ్యాన్స్ కు ఫ్యాన్స్ ఫిద్దా అవుతున్నారు. అద్దం ముందు బలే డ్యాన్స్ చేస్తున్నారే, ఎంత ముద్దుగా డ్యాన్స్ చేస్తున్నారో ఇద్దరూ అంటూ కామెంట్లు చేస్తున్నారు. వీరిద్దరూ కలిసి కోహ్లీ, అనుష్క మ్యారేజ్ ఫంక్షన్ లో డ్యాన్స్ చేసి అలరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న క్రికెటర్లు కాళీ సమయంలో ఇలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంగ్లండ్ పర్యటనలో  భాగంగా కోహ్లీసేన.. టీ20, వన్డే, టెస్టు సిరీస్ లు ఆడనుంది. రేపటినుంచి టీ20 సిరీస్ ప్రారంభంకానుంది.