- Advertisement -
కరోనా వైరస్ కారణంగా ఐపీఎల్ 2020 నిరవధికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐపీఎల్ నిర్వహణపై స్పందించాడు భారత మాజీ స్పిన్నర్ హర్బజన్ సింగ్.
ఐపీఎల్ భవిష్యత్తు పై బీసీసీఐ ఏ నిర్ణయాలు తీసుకుంటుందో తనకు తెలియదన్నారు. 13 సంవత్సరాలలో మొదటిసారి ఐపీఎల్ జరగకపోయినా అది మంచిదని తాను అనుకుంటున్నానని ఎందుకంటే మానవ జీవితం కంటే ఐపీఎల్ ఎక్కువ కాదన్నాడు.
క్రికెటర్లు అయితే బయటకు వచ్చి తమ అభిమానులను అలరించడం ప్రారంభించాల్సిన అవసరం లేదని ఈ సంవత్సరం ఐపీఎల్ ను పూర్తిగా రద్దు చేయాలనే ఆలోచన కరెక్ట్ అన్నాడు.
కరోనాతో తొలుత ఐపీఎల్‌ను ఏప్రిల్ 15కి వాయిదా వేసింది బీసీసీఐ. తర్వాత లాక్ డౌన్ రెండు సార్లు పొడగించిన నేపథ్యంలో ఐపీఎల్‌ని నిరవధికంగా వాయిదా వేసింది ప్రభుత్వం.
- Advertisement -