హ్యాపి బర్త్ డే టూ విజయ్ దేవరకొండ

203
Vijay Devarakonda

విజయ్ దేవరకొండ ఈపేరు ఇప్పుడు టాలీవుడ్ సెన్సేషన్ గా మారింది. ఆయనంటే యూత్ లో యమ క్రేజ్. తన మాటలు , బాడీ లాంగ్వేజ్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. యూత్ హీరో విజయ్ పుట్టినరోజు నేడు. విజయ్ దేవరకొండ మే9 1989న జన్మించాడు. ఆయన ఇంటర్మీడియట్ విద్యను లిటిల్ ప్లవర్ జూనియర్ కాలేజ్ లో చేయగా.. డిగ్రీని బద్రుక కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఆర్ట్స్ లో చదివారు. విజయ్ మొదటగా నువ్విలా సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.

ఆ తర్వాత లైఫ్ ఈజ్ బ్యూటిపుల్ సినిమాలో క్యారెక్టర్ ఆర్టీస్ట్ గా చేశాడు. 2015లో వచ్చిన ఎవడే సుబ్రమ్మణ్యం సినిమాలో కీలక పాత్రలో నటించాడు. ఈమూవీ తర్వాత తరుణ్ దర్శకత్వంలో వచ్చిన పెళ్లి చూపులు మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈమూవీ ఘన విజయం సాధించడంతో ఆయనకు మంచి పేరును తీసుకువచ్చింది. ఈమూవీ తర్వాత దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన అర్జున్ రెడ్డి మూవీ టాలీవుడ్ లో సెన్సేషనల్ గా మారింది. బాక్సాఫిస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.

దీంతో విజయ్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. అయితే అప్పటి వరకూ మాస్ ప్రేక్షకులను మాత్రమే అలరించిన విజయ్ గీతా గోవిందం సినిమాతో క్లాస్ ఆడియన్స్ ను అలరించాడు. ఆ తర్వాత ఆయన నటించిన ట్యాక్సివాలా మూవీ మరో రికార్డు క్రియేట్ చేసింది. ప్రస్తుతం టాలీవుడ్ లో ఆయనకు ఫుల్ క్రేజ్ పెరిగింది. ఆయన సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం విజయ్ డియర్ కామ్రేడ్ మూవీలో నటిస్తున్నాడు. ఈచిత్రంలో విజయ్ సరసన రష్మీక మందన హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమాకు భరత్ కమ్మ దర్శకత్వం వహించగా..మైత్రి మూవీ మేకర్స్ సంస్ధ వారు నిర్మిస్తున్నారు.