టీవీ9 సీఈవోగా రవిప్రకాశ్ ను తొలగించిన యాజమాన్యం

281
Ravi Prakash
- Advertisement -

టీవీ 9 ఛానల్ సీఈవో రవి ప్రకాశ్ ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. అలంద మీడియా సంస్ధ ఫిర్యాదు మేరకు తనిఖిలు చేసినట్టు తెలుస్తుంది. అలంద సంస్ధ మీడియా నిధులను పక్కదారి పట్టించారని అంతేకాకుండా ఈ సంస్థ యాజమాని తన సంతకాన్ని రవిప్రకాష్ ఫోర్జరీ చేశారని కూడా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుల ఆధారంగా రవి ప్రకాశ్ ఇంట్లో ఆఫీసులులో తనిఖిలు నిర్వహించారు పోలీసులు. రవిప్రకాశ్ పై ఐటీ యాక్ట్ 56, ఐపీసీ 406, 467 సెక్షన్ల కింద నోటీసులు జారీ చేశారని తెలుస్తుంది.

అలంద మీడియా ఎంటర్ టైన్ మెంట్ సంస్ధలో జూపల్లి రామేశ్వర్ రావు, అరుణ్ ప్రణిత్ మునగాల, పుల్లూరి కౌశిక్ రావులు, ప్రేమ్ కుమార్ పాండే లు డైరెక్టర్లుగా ఉన్నారు. ఈ సోదాలు జరుగుతున్న సమయంలో ఇంట్లో, కార్యాలయంలో కూడ రవిప్రకాష్ లేనట్టుగా తెలుస్తుంది. దీంతో టీవీ 9 కార్యాలయంలో కీలకమైన ఫైళ్లు, హార్డ్ డిస్క్‌లు మాయమైనట్టుగా పోలీసులు గుర్తించారని తెలిసింది. కొద్ది రోజుల క్రితం ఎబిసీఎల్ కార్పొరేషన్ సంస్ధ నుండి టీవీ 9 ను అలంద మీడియా సంస్ధను కొనుగోలు చేసింది.

తాజాగా ఉన్న సమాచారం మేరకు టీవీ9 సీఈవో పదవి నుంచి రవిప్రకాష్‌ను తొలగించింది యాజమాన్యం. టీవీ9 వాటాలో 91శాతం షేర్ ఉన్న అలంద మీడియా సంస్ధ యాజమాన్యానికి రవిప్రకాష్‌ అడ్డుతగులుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీవీ9లో 91 శాతానికి పైగా అలందా మీడియాకు వాటా ఉండగా.. రవిప్రకాష్‌కు 8.5 శాతం వాటా ఉన్నట్టు తెలుస్తోంది. రవి ప్రకాష్, శివాజీ ఇద్దరు కలిసి ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి మమ్మల్ని మోసం చేసి డైరెక్టర్ల నియామకాన్ని అడ్డుకుంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు అలందా డైరెక్టర్ కౌశిక్ రావు.

- Advertisement -