తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోగా ఎదిగిన వారిలో విక్టరీ వెంకటేష్ ఒకరు. క్లాస్..అయినా, మాస్ అయినా, ఏ పాత్ర చేసినా ఆ పాత్రలో ఒదిగిపోయి…ఆ పాత్రకే వన్నె తెచ్చే కథానాయకుడు విక్టరీ వెంకటేష్. ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి తన పాత్రలతో ప్రేక్షకుల హ్రుదయాల్లో సుస్ధిర స్ధానం సంపాదించుకున్నాడు వెంకీ.వెంకీ ఏ పాత్రనైనా అవలీలగా చేయగలడనిపించుకున్నారు. ప్రేమించుకుందాం రా, కలిసుందాం రా, ప్రేమతో రా.. తదితర చిత్రాలతో ఇండస్ట్రీలో ఓ కొత్త ఒరవడి స్రుష్టించారు వెంకీ. అలాగే కుబుంబ కథా చిత్రాల్లో నటించి లేడీస్ ను ఎంతగానో ఆకట్టుకున్నారు. కుటుంబ కథా చిత్రాల కథానాయకుడు అంటే వెంకటేషే అనేంత పేరు సంపాదించారు. ఇవాళ ఆయన పుట్టినరోజు సందర్భంగా greattelangaana.com ప్రత్యేక కథనం.
డిసెంబర్ 13, 1960లో జన్మించిన ఆయన నేటితో 53 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. సుప్రసిద్ధ తెలుగు నిర్మాత మరియు అత్యధిక చిత్రాల నిర్మాతగా గిన్నీస్ బుక్ ప్రపంచరికార్డు సాధించిన డి.రామానాయుడు రెండవ కుమారుడైన వెంకటేష్ వెంకటేష్ అమెరికాలోని మాంటెర్రీ విశ్వవిద్యాలయములో ఎం.బి.ఏ చదివారు. వెంకటేష్‌కు నలుగురు సంతానం. హయవాహిని, ఆశ్రిత, భావన, అర్జున్ రామనాథ్.
వెంకీకి బాగా పేరు తెచ్చిన సినిమాలు చంటి, కలిసుందాం రా, సుందరకాండ, రాజా, బొబ్బిలిరాజా, ప్రేమించుకుందాం రా, పవిత్రబంధం, సూర్యవంశం, లక్ష్మి, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే మొదలైనవి. నటుడిగా రెండేళ్ళ ప్రాయంలోనే, ఆయన కాశీనాధుని విశ్వనాధ్ దర్శకత్వం వహించిన స్వర్ణకమలం లో నటించి ఎన్నో ప్రశంసలు అందుకున్నారు.1986లో కలియుగ పాండవులు చిత్రం ద్వారా తెరంగ్రేటం చేసిన వెంకీ…గత 30 సంవత్సరాలుగా టాలీవుడ్లో తన హవా కొనసాగిస్తున్నారు.
వెంకీ సినిమాల ద్వారా చాలా మంది హీరోయిన్స్ తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఫరా, టబు, దివ్యభారతి, గౌతమి, ప్రేమ, ఆర్తీ అగర్వాల్, ప్రీతి జింతా, కత్రినా కైఫ్, అంజలా జవేరి మొదలగు వారిని వెంకటేష్ తెలుగులో పరిచయం చేశారు. వెంకటేష్ కి చిన్నప్పటి నుంచి చదువంటే బాగా ఇష్టం. ఉన్నత విద్య అంతా అమెరికాలోనే కొనసాగించాడు. అమెరికాలోని మోంటెర్రీ యూనీవర్శిటి నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్ డిగ్రీ చేశారు.
సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో సూపర్ స్టార్ మహేష్ తో కలసి నటించి… మల్లీస్టారర్ మూవీస్ కి నాంది పలికారు. ఆతర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో గోపాల గోపాల మూవీ చేసారు. విజయాన్ని సాధించారు. దీంతో ఇండస్ట్రీలో మళ్లీ మల్టీస్టారర్ మూవీస్ కి ఓ ఊపు వచ్చింది. దటీజ్ వెంకీ. విభిన్న కథా చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న వెంకీ తాజాగా గురుగా ముందుకువస్తున్నాడు. తనదైన మానరిజంతో ప్రేక్షకులను అలరిస్తున్న వెంకీ…మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని గ్రేట్ తెలంగాణ.కామ్ కోరుకుంటోంది.