అకట్టుకునేలా ఓ ‘నారప్ప’ సాంగ్‌..

157

విక్టరీ వెంకటేష్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘నారప్ప’. ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. సురేశ్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం జులై 20న అమెజాన్ ప్రైమ్ ఓటీటీ వేదికపై విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ నుంచి ఓ హుషారైన పాట శుక్రవారం విడుదలైంది. ఓ నారప్ప అనే గీతానికి మణిశర్మ బాణీలు అందించగా, అనంత శ్రీరామ్ సాహిత్యం అందించారు.

ఈ పాటను చిత్రబృందం సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ చిత్రంలో వెంకటేశ్, ప్రియమణి జంటగా నటిస్తున్నారు. రెండ్రోజుల కిందట విడుదలై నారప్ప ట్రైలర్‌కు విశేషమైన స్పందన వస్తోంది. వెంకటేశ్ పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ కు అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

#Narappa - Ooo Narappa Lyrical Video || Daggubati Venkatesh || Priyamani || ManiSharma || SP Music