ఉప్పెన బ్యూటీ…బర్త్ డే ట్రీట్!

68
kriti

ఉప్పెన సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ కృతిశెట్టి. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బేబమ్మగా యూత్‌ని ఫిదా చేసింది కృతి. తొలి సినిమా హిట్‌తో వెనక్కి తిరిగిచూడని ఈ అమ్మడుకి బర్త్ డే సందర్భంగా అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు మేకర్స్‌.

ఆమె నటించబోయే సినిమాలకు సంబంధించి అప్‌డేట్ ఇచ్చి స్పెషల్ విషెస్ తెలిపారు కృతి. నాని నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమాతో పాటు ఎనర్జిటిక్ హీరో రామ్‌తో మరో మూవీ, ‘బంగార్రాజు’ సినిమాలో ఆమె చైతూ జోడీగా కనిపించనుంది. అలాగే సుధీర్ బాబు సరసన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే మూవీ చేస్తోంది.

దీంతో పాటు నితిన్ హీరోగా తెరకెక్కుతున్న మాచర్ల నియోజక వర్గం సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సందర్భంగా ఆయా సినిమాలకు సంబంధించి ఫస్ట్ లుక్స్‌ విడుదల చేయడంతో పాటు శుభాకాంక్షలు తెలిపారు మేకర్స్‌.