రికార్డుల బాహుబలి..!

209
- Advertisement -

క్రికెట్ క్రీడ‌ను మ‌రో ఎత్తుకు తీసుకెళ్లి గాడ్ ఆఫ్ క్రికెట్‌గా సచిన్‌ రమేష్ టెండూల్కర్ నిలిచిపోయాడు. మైదానంలో స‌చిన్ నెల‌కొల్ప‌ని రికార్డంటూ లేదు. భార‌త్ మ్యాచ్ ఆడుతుందంటే ఈ మాస్ట‌ర్ కోసమే క్రికెట్ లవర్స్‌ స్టేడియంకు చేరుకుంటారు అనడంలో సందేహం లేదు. అంత‌లా ప్ర‌పంచ వ్యాప్తంగా అభిమానుల హృద‌యాల్లో నిలిచిపోయాడు సచిన్‌. ఈ రోజు స‌చిన్ టెండూల్క‌ర్ 44వ పుట్టిన‌రోజు.
 Happy birthday, Sachin Tendulkar
1973 ఏప్రిల్ 24 ర‌మేష్ టెండూల్క‌ర్‌,ర‌జ‌నీ దంప‌తుల‌కు స‌చిన్ టెండూల్క‌ర్ జ‌న్మించాడు. బుడిబుడి అడుగులు వేసే స‌మ‌యంలోనే స‌చిన్ బ్యాట్‌ప‌ట్టాడు. ఆ త‌ర్వాత అదే త‌న కెరీర్‌గా మ‌లుచుకుని కోచ్ అచ్రేక‌ర్ వ‌ద్ద క్రికెట్‌లో ఓనామాలు దిద్దాడు. 16 ఏళ్ల వ‌య‌స్సులోనే అంటే 1989 న‌వంబ‌ర్ 15న పాకిస్తాన్ పై అరంగేట్రం చేసిన స‌చిన్, ఆ త‌ర్వాత వెనుదిరిగి చూడ‌లేదు. బ్యాట్‌తో ఎన్నో రికార్డుల‌ను బద్దలుకొట్టాడు.

అప్ప‌టి వ‌ర‌కు ఇత‌ర బ్యాట్స్‌మెన్‌ల‌పై ఉన్న రికార్డుల‌న్నీ చెరిపివేసి అంత‌ర్జాతీయ క్రికెట్‌లో నూతనాధ్యాయానికి నాంది ప‌లికాడు. భార‌త జ‌ట్టుకు ఎన్నో చిర‌స్మ‌ర‌ణీయ విజ‌యాలు అందించాడు. ఒకానొక సంద‌ర్భంలో ఫామ్ కోల్పోయి చాలా విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నాడు సచిన్‌. అయినా.. విమ‌ర్శ‌లు ఎక్కు పెట్టిన వారికి త‌న బ్యాట్‌తోనే స‌మాధానం చెప్పిన ధీశాలి స‌చిన్ టెండూల్క‌ర్.
 Happy birthday, Sachin Tendulkar
స‌చిన్ ఆట ఎంత అద్భుతంగా ఉంటుందో త‌న ప్ర‌వ‌ర్త‌న కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. వివాదార‌హితుడిగా పేరుగాంచిన లిటిల్ మాస్ట‌ర్‌ను ఎన్నో అవార్డులు రివార్డులు వ‌రించాయి. క్రికెట్‌లో దేశాన్ని ముందు వ‌ర‌స‌లో నిల‌బెట్టిన స‌చిన్ సేవ‌ల‌ను గుర్విస్తూ భార‌త ప్ర‌భుత్వం 2014లో దేశ అత్యున్న‌త పౌర పుర‌స్కారం భార‌త‌ర‌త్న‌తో గౌర‌వించింది. అంత‌కుముందు అర్జున అవార్డు, రాజీవ్ గాంధీ ఖేల్ ర‌త్న అవార్డు ,ప‌ద్మ‌శ్రీ, ప‌ద్మ‌విభూష‌ణ్ అవార్డులు సైతం స‌చిన్‌ను వ‌రించాయి.

- Advertisement -