ఆ బుడ్డోడు ముదిరిపోయాడు..

210
five-year-old-boy-waving-knife-truck-driver
five-year-old-boy-waving-knife-truck-driver
- Advertisement -

తన బామ్మ దుకాణం తొలగిస్తున్న పోలీసులపై చైనాకి చెందిన నాలుగేళ్ల పిల్లాడు ఆగ్రహంతో వూగిపోయిన వీడియో ఎంత వైరల్ అయిందో అందరికి తెలిసిందే. రోడ్డు పక్కన ఉన్న తన బామ్మ షాపును తీసేస్తుంటే… మూడేళ్ల వయసులోనే గట్టిగా అరుస్తూ పోలీసులపై కోపం చూపించాడు. ఇప్పుడు ఆ పిల్లాడికి అయిదేళ్లు వచ్చాయి. అప్పటికన్నా ఇప్పుడు ఇంకా ముదిరి రౌడీలా తయరయ్యాడు.

https://youtu.be/7lQD3lGjee0

ఐదేళ్ల క్సియో పాంగ్‌ తన బామ్మ దుకాణం వద్ద ఉండగా..తన బామ్మ షాపు ముందు ఓ ట్రాలీ ఆటో వచ్చి ఆగింది. దుకాణం ముందు ట్రాలీ పెట్టి గిరాకీ రాకుండా చేస్తున్నావని ట్రాలీ డ్రైవర్‌ను ఎడాపెడా తిట్టేశాడు.

xia

ట్రాలీని అక్కణ్నించి తీసేయమంటూ బుడతడు కత్తి పట్టుకుని.. ట్రాలీ డ్రైవర్‌ని బెదిరిస్తూ… ట్రాలీ చక్రాన్ని కత్తితో పొడిచేందుకు ప్రయత్నించాడు. పండ్లు కోసే కత్తితో డ్రైవర్‌ను ‘నువ్వు పార్కింగ్‌ ఇక్కడ చేయకూడదు. పార్క్‌ చేస్తే కొడతా’ అంటూ బెదరించడమే కాదు.. టైర్‌ పంక్చర్‌ కూడా చేయబోయాడు.

xia1

పంక్చర్‌ చేస్తే ట్రాలీ వెనక్కి వెళ్లదనుకున్నాడో ఏమో.. ఆ పని చేయకుండా ట్రాలీ తీసేవరకు కత్తి పట్టుకొని అక్కడే నిల్చున్నాడు. అంతలా ఆ పిల్లాడు ఆవేశపడుతుంటే.. ఎవరూ అతన్ని అడ్డుకోలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అంత చిన్న వయసులో పిల్లాడు అలా విపరీతంగా ప్రవర్తిస్తున్నా… అతని తాలూకా పెద్దలెవరూ అడ్డు చెప్పడం లేదని కొందరు విమర్శలు చేస్తుండగా… మరికొందరు ఈ బుడ్డోడు మిరింత ముదిరిపోయాడని.. స్ట్రీట్ రౌడీలా ప్రవర్తింస్తుంటే అడ్డు చెప్పకుండా అక్కడి ప్రజలు తెగ ఎంజాయ్ చేస్తున్నారని మరికొందరు అంటున్నారు..

- Advertisement -