తేజ ‘హను మాన్’ నుండి ఆసక్తికరమైన పోస్టర్‌..

34
Hanuman
Hanuman

టాలీవుడ్‌ యంగ్ హీరో తేజ సజ్జ నటిస్తున్న చిత్రం ‘హను మాన్’. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ నుండి తాజాగా ఓ సరికొత్త పోస్టర్‌ను వదిలి లేటెస్ట్ అప్‌డేట్ ఇచ్చింది చిత్రబృందం. ప్రస్తుతం చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతున్న నేపథ్యంలో ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ వదిలి, వచ్చే సెప్టెంబర్ 18న ఉదయం 10 గంటల 8 నిమిషాలకు ‘అంజనాద్రి నుంచి తమ హనుమంతుని కలుసుకోవచ్చని’..అని తెలిపారు. బహుశా ఇది ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కావచ్చు అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా పరంగా మాత్రం టాలీవుడ్ ఆడియెన్స్ చాలా ఆసక్తిగా ఉన్నారు. నిరవ్ రెడ్డి-చైతన్య నిరవ్ తదితరులు ఈ చిత్రంతో అసోసియేట్ అయ్యారు.