మంత్రి కేటీఆర్‌ని కలిసిన టీమిండియా క్రికెటర్…

58
hanuma vihari

భారత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్,హైదరాబాదీ క్రికెటర్ హనుమ విహారి హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్‌ని కలిశారు. గాయం కారణంగా ఆసీస్‌ టూర్‌ నుండి తిరిగొచ్చిన విహారి…కేటీఆర్‌ని కలిసిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

మిమ్మల్ని కలవడం మరియు క్రికెట్ గురించి మాట్లాడటం చాలా ఆనందంగా ఉందని ట్యాగ్ చేశారు. ఇటీవల ఆసీస్‌తో జరిగిన మూడో టెస్టులో అసమాన పోరాట పటిమను కనబర్చిన విహారిపై ప్రశంసలు వెల్లువెత్తగా కేటీఆర్ కూడా హర్షం వ్యక్తం చేశారు.

ఇదో అద్భుతమైన టెస్టు అని, భారత ఆటగాళ్ల తెగువ, పట్టుదల, ధైర్యాన్ని కొనియాడారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్‌ని కలిసి సంతోషాన్ని వ్యక్తం చేశారు విహారి.