సీజేఐ ఎన్వీ రమణను కలిసిన గుత్తా సుఖేందర్ రెడ్డి..

144
Gutha Sukender Reddy
- Advertisement -

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణను తెలంగాణ రాష్ట్ర శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి బుధవారం రాజ్ భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియామకమైనందుకు జస్టీస్ ఎన్వీ రమణకు పుష్పగుచ్చం అందజేసి,శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు గుత్తా సుఖేందర్ రెడ్డి. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ నల్గొండ జిల్లాలో పంటలు ఎలా పండుతున్నాయని, వరి పంట పండించడంలో నల్గొండ జిల్లా ప్రథమ స్థానంలో ఎలా నిలిచిందని సుఖేందర్ రెడ్డిని ఆడిగారు. నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్,ఏఎంఆర్,డిండి ప్రాజెక్టుల ద్వారా సాగు నీరు అందించడం జరిగిందని అలాగే కొత్తగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని యస్ఆర్ఎస్పీ కాలువ ద్వారా పంటపొలాలు అందించడం వలన వరి పంటను రైతులు బాగా పండిచటం జరిగిందని తెలిపారు.

ఉమ్మడి నల్గొండ జిల్లా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అన్ని విధాలుగా చాలా అభివృద్ధి చెందిందని ఆయన ఛీప్ జస్టిస్‌కు వివరించారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ వంటి గొప్ప ప్రాజెక్టులు నల్గొండ జిల్లాలో నెలకొల్పడం జరిగిందని తెలిపారు. అంతేకాదు ఫార్మా రంగానికి చెందిన పెద్ద పెద్ద కంపెనీలు దివిస్ లాబొరేటరీస్,నాట్కో,మొదలగు కంపెనీలు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఉన్నాయని ఛీప్ జస్టిస్‌కు సుఖేందర్ రెడ్డి వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన అద్భుతంగా ఉందని, యాదాద్రి ఆలయాన్ని అత్యద్భుతంగా డెవలప్ చేశారని జస్టిస్ ఎన్వీ రమణ సుఖేందర్‌తో చెబుతూ, రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ను గొప్పగా అభినందించారు. సుఖేందర్ రెడ్డితో పాటు నల్గొండ జడ్పి ఫ్లోర్ లీడర్, తిప్పర్తి జడ్పిటిసీ పాశం రాం రెడ్డి కూడా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -