18న సమంతతో ‘కల్యాణం’.. వీడియో సాంగ్ రిలీజ్..

174
samantha akkineni
- Advertisement -

టాలీవుడ్‌ హీరో ఆనంద్ దేవరకొండ, గీత్ శైనీ జంటగా ‘పుష్పక విమానం’ సినిమా రూపొందింది. రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్ టైన‌ర్‌గా వ‌స్తున్న ఈ మూవీని దామోద‌ర్ డైరెక్ట్ చేస్తున్నాడు.. సునీల్ ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ పూర్తైంది. త్వరలో ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్ర బృందం. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌ మొదలుపెట్టారు. ఇప్పటికే ఈ మూవీ నుండి ‘సిలకా’ అనే లిరికల్ వీడియోను విడుదల చేశారు. ఈ పాటకు మంచి స్పందన లభించింది.

ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి ‘కల్యాణం .. ‘ అనే మరో లిరికల్ సాంగ్ ను వదలడానికి సన్నాహాలు చేస్తున్నారు. హీరోయిన్ సమంతతో ఈ నెల 18వ తేదీన ఉదయం 11 గంటలకు ఈ లిరికల్ వీడియోను రిలీజ్ చేయించనున్నారు. కాసర్ల శ్యామ్ రాయగా .. రామ్ మిరియాల సంగీతంలో, సిద్ శ్రీరామ్ – మంగ్లీ కలిసి ఈ పాటను ఆలపించారు. విజ‌య్ దేవ‌ర‌కొండ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ కింగ్ ఆఫ్ ది హిల్ ప్రొడ‌క్ష‌న్స్-టాంగా ప్రొడ‌క్ష‌న్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్నినిర్మిస్తున్నాయి.

- Advertisement -