ఫిబ్రవరిలో రాబోతున్న ‘గుర్తుందా సీతాకాలం’..

30
Gurthundha Seethakalam

టాలీవుడ్ హీరో సత్యదేవ్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా నటిస్తున్న చిత్రం ‘గుర్తుందా సీతాకాలం’. కన్నడ సూపర్ హిట్ ‘లవ్ మాక్‌టైల్’ చిత్రానికిది రీమేక్ వెర్షన్. నాగశేఖర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మేఘా ఆకాశ్, కావ్యా శెట్టి కీలక పాత్రలు పోషిస్తున్నారు. నాగశేఖర్ మూవీస్, శ్రీవేదాంశ మూవీస్, మణికంఠ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి లక్ష్మీ భూపాల సంభాషణలు అందిస్తుండగా.. కాలభైరవి సంగీతం సమకూర్చుతున్నారు.

ఇక ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా విడుదల తేదీని ఇంకా ప్రకటించనప్పటికీ.. ఫిబ్రవరిలో రాబోతున్నట్టు మేకర్స్ ఓ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేస్తూ ప్రకటించారు. ఈ చిత్రానికి ఏ డేట్‌ను ఫిక్స్ చేస్తారు అన్నది ఆసక్తిగా మారింది. అయితే ఇది లవ్‌స్టోరీ కాబట్టి.. బహుశా వేలెంటైన్స్ డే ను టార్గెట్ చేస్తారేమోనని చెప్పుకుంటున్నారు. ఎందుకుంటే రాబోయే వేలెంటైన్స్ మంత్‌లో దేవ్, నిధిలతో ప్రేమలో పడండి అని పోస్టర్ మీద మెన్షన్ చేశారు మేకర్స్.