నాని ‘శ్యామ్ సింగ‌రాయ్’ ట్రైలర్‌ వచ్చేస్తోంది..

30
Nani Shyam Singha Roy

న్యాచురల్‌ స్టార్‌ నాని కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం ‘శ్యామ్‌ సింగ రాయ్‌’. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌,టీజర్‌, పోస్టర్స్‌ ప్రేక్షకుల నుంచి విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమపై ఇండస్ట్రీలోనూ ఇటు ప్రేక్షకుల్లోనూ అంచనాలను భారీగా పెంచేసింది. ద‌ర్శ‌కుడు రాహుల్‌ సంకృత్యాన్‌ ఓ యూనిక్‌ కాన్సెప్ట్‌తో ‘శ్యామ్‌సింగ రాయ్‌’ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమా ఈనెల 24న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్‌లో విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో రేపు (డిసెంబర్ 14)న ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. ఈ సందర్బంగా ఓ ప్రత్యేక పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. నానీ, సాయిపల్లవిల ఫ్యామిలీ ఫోటో ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో త‌న గ‌త చిత్రాల‌కు భిన్న‌మైన స‌రికొత్త గెట‌ప్స్‌ల‌లో నేచుర‌ల్ స్టార్ నాని క‌నిపించ‌నున్నారు. సాయిపల్లవి, కృతిశెట్టి, మడోనా సెబాస్టియన్ ముగ్గురు బ్యూటిఫుల్ హీరోయిన్స్ న‌టిస్తోన్న ఈ చిత్రాన్ని ప్ర‌తిభావంతులైన సాంకేతిక నిపుణులతో ఎక్కడ రాజీ పడకుండా నిర్మాత వెంకట్‌ బోయనపల్లి రూపొందిస్తున్నారు.

నిహారిక ఎంటర్‌టైన్మెంట్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రానికి సత్యదేవ్‌ జంగా కథ అందించారు. మెలోడీ స్పెషలిస్ట్‌ మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్ నవీన్‌ నూలి ఈ సినిమాకు ఎడిటర్‌గా వర్క్‌ చేస్తున్నారు.