గుజరాత్ ఎన్నికలకు మోగిన నగారా

254
- Advertisement -

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. రెండు దశల్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా డిసెంబర్ 1న మొదటి, 5న రెండవ దశ పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 8వ తేదీన ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడించనున్నారు.

గత నెలలో ప్రకటించిన హిమాచల్ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలతో పాటే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది.

గుజరాత్‌ రాష్ట్రంలో చివరిసారిగా 2017లో అసెంబ్లీ ఎన్నికలు జరుగగా వరుసగా ఐదోసారి అధికారంలోకి వచ్చింది బీజేపీ. 182 స్థానాలకు గాను బీజేపీ 99 స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్ 77 స్థానాలను కైవసం చేసుకొని రెండో స్థానానికి పరిమితమైంది. ఇక ఈసారి త్రిముఖ పోరు బీజేపీ,ఆప్,కాంగ్రెస్ మధ్య జరగనుంది.

ఇవి కూడా చదవండి..

కొరివితో తలగోక్కున్న బిజెపి

బండికి అధిష్టానం అక్షింతలు..

మునుగోడు బిజెపికి ప్రతిష్టాత్మకమే

- Advertisement -