గుజరాత్ లో బీజేపీ గెలుపు.. అలా ఎలా ?

201
- Advertisement -

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కనీవినీ ఎరుగని రీతిలో విజయం సాధించింది. మొత్తం 182 స్థానాలకు గాను 156 స్థానాల్లో భాజపా విజయం సాధించగా, కాంగ్రెస్ 17, ఆమ్ ఆద్మీ 5, ఇతరులు 4 స్థానాల్లో విజయం సాధించారు. గత 27 ఏళ్లుగా గుజరాత్ లో బీజేపీ ఏకచక్రధిపత్యం కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఆరు సార్లు విజయం సాధించిన బీజేపీ ఇటీవల వెలువడిన ఫలితాలతో 7 సారి కూడా విజయం సొంతం చేసుకుంది. 2017 ఎన్నికల్లో 99 స్థానాలకే పరిమితం అయిన బీజేపీ ఈ రెన్నికల్లో మాత్రం ఏకంగా 152 స్థానాలు కైవసం చేసుకొని అందరినీ ఆశ్చర్య పరిచింది. గతంలో 1985లో 149 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించిగా, ఆ రికార్డ్ ను ఇప్పుడు బీజేపీ బ్రేక్ చేసింది. .

ఇదిలా ఉంచితే ఇంత భారీ విజయం బీజేపీకి ఎలా వచ్చింది.. అసలు ఎలా సాధ్యమైంది అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అయితే దేశాన్ని పాలిస్తున్న నరేంద్ర మోడీ, అమిత్ షా ఈ రాష్ట్రనికి చెందిన వారే గనుక విజయం సాధించడం కష్టమేమీ కాదని అనుకోవచ్చు. కానీ మెజారిటి పరంగా చూస్తే ఇది భారీ విజయం. ఇంత భారీ విజయాన్ని కట్టబెట్టేందుకు గుజరాతీయులు నిజంగానే సిద్దంగా ఉన్నారా గుజరాత్ లో పరిపాలన అంత సవ్యంగా ఉందా ? అంటే కాదనే వాదన కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. రైతులను ఆదుకోవడంలో బీజేపీ ప్రభుత్వం విఫలం అయిందనే విమర్శలు గట్టిగానే వినిపించాయి. అంతే కాకుండా ఆ రాష్ట్రం గత కొన్నేళ్లుగా తీవ్ర వ్యవసాయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.

అలాగే ఆయా సామాజిక వర్గాలలో కూడా బీజేపీ పై వ్యతిరేకత ఉంది. గత ఎన్నికల్లో పటిదార్ సామాజిక వర్గం బీజేపీ పై వ్యతిరేక చూపుతూ వచ్చింది. దాంతో ఈ ఎన్నికల్లో ఆ సామాజిక వర్గానికి చెందిన భూపేంద్ర పటేల్ ను సి‌ఎం అభ్యర్థిగా నిలిపింది. దాంతో ఆ సామాజిక వర్గం నుంచి కాస్త వ్యతిరేకత తగ్గినప్పటికి, ఇంకా ఎస్సీ, ఎస్టీ వంటి వెనుకబడిన సామాజిక వర్గాలపై బీజేపీ ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందనే విమర్శలు కూడా గట్టినగానే వినిపించాయి. ఇక ఆ రాష్ట్రంలో పెను సంచలనంగా మారిన బిల్కిస్ బానో రేప్ కేసు లో 11 మంది ధోషులను బీజేపీ ప్రభుత్వం తిరిగి విడుదల చేయడంపై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి.

ఇలా చాలా వాటిలో బీజేపీ ప్రభుత్వంపై గుజరాతీ ప్రజల్లో వ్యతిరేకత ఉందనేది ఎవరు కదనలేని వాస్తవం. అయితే ఎన్నికల్లో మాత్రం ఊహించని విధంగా కనీవినీ ఎరుగని రీతిలో 152 సీట్లలో విజయం సాధించింది కాషాయ పార్టీ. మరి ప్రజా వ్యతిరేకత ఏమైనట్టు అంటే.. ప్రజా తీర్పులో మార్పు లేకపోయినప్పటికి బీజేపీ వచ్చిన ఫలితం లోనే అసలైన మార్పు ఉందనేది కొందరి అభిప్రాయం. ఈవిఎమ్ మిషన్ లు కాకుండా బ్యాలెట్ పాత్రలతో ఎన్నికలు నిర్వహించి ఉంటే బీజేపీకి ఇంత భారీ విజయం వచ్చేది కాదని కొందరి అభిప్రాయం. గత కొన్నేళ్లుగా ఈవిఎమ్ ఫలితాలపై ఎన్నో విమర్శలు వస్తూనే ఉన్నాయి.

ఈవిఎమ్ ల ద్వారా ఫలితాలను మార్చవచ్చని, ప్రజా నిర్ణయాన్ని తప్పించవచ్చనే వాదన మొదటి నుంచి కూడా వినిపిస్తూనే ఉంది. వీటికి ఆధ్యమ్ పోస్తూ చాలా సందర్భాలలో ఓటర్లు కూడా తాము ఓటు వేసినవారికి కాకుండా ఇతరులకు పడినట్లుగా చూపించాయనే ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. అయితే ఎన్నికల్లో గెలుపోటములను అధికార పార్టీ డిసైడ్ చేస్తుదనడంలో సరైన ఆధారాలు లేనప్పటికి.. ఈవిఎమ్ ల ఫలితాలపై అనుమానాలు మాత్రం ఎన్నికల ఫలితాలు వచ్చిన ప్రతిసారి తెరపైకి రావడం సర్వసాధారణం అయిపోయింది. మరి గుజరాత్ లో బీజేపీ భారీ గెలుపు.. నిజమైన ప్రజా తీర్పేనా ? లేదా ఈవిఎమ్ ల జిమ్మీకా అనే ప్రశ్నలు ఇప్పుడు పోలిటికల్ సర్కిల్స్ లో బాగా వినిపిస్తున్న ప్రశ్నలు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -