బండి పాద‌యాత్ర‌తో నేత‌ల మ‌ధ్య ఆధిప‌త్య పోరు..

85
- Advertisement -

వాపును చూసి బ‌లుపు అనుకోవ‌ద్దు అన్న సామేత తెలంగాణ‌లో బాగా ఫేమ‌స్. ఇప్పుడు తెలంగాణ బీజేపీకి స‌రిగ్గా స‌రిపోయేలా ఉంది. వ‌రుస‌గా రెండు ఉప ఎన్నిక‌ల్లో గెలుపుతో నెక్ట్స్ అధికారం త‌మ‌దేనంటూ బీజేపీ నేత‌లు హాడావిడి చేశారు. ఈ హాడావిడి న‌డిచినంత కాలం బీజేపీలో ఉన్న గ్రూపులు, అసంతృప్తులు పెద్ద‌గా బ‌య‌ట ప‌డ‌లేదు. కానీ, రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ పాద‌యాత్ర‌తో నేత‌ల మ‌ధ్య ఉన్న ఆధిప‌త్య పోరు, గ్రూపులు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. కాంగ్రెస్ క‌న్నా తామేమీ త‌క్కువ కాద‌న్న‌ట్లుగా ప‌రిస్థితి మారిపోయింది. బండి సంజ‌య్ తో పాటు ఆయ‌న వ‌ర్గం పాద‌యాత్ర‌లో ఉంటే ఇత‌ర స‌మ‌స్య‌ల‌పై మాట్లాడేందుకు బీజేపీ ఆఫీసు వైపు కూడా ఆయ‌న వైరి వ‌ర్గాలు తొంగి చూడ‌టం లేదు. పైగా పాద‌యాత్ర‌కు కూడా పెద్ద‌గా స్పంద‌న లేక‌పోవ‌టంతో బీజేపీ నేత‌ల్లో తీవ్ర అసంతృప్తులు, గంద‌ర‌గోళాలు బ‌య‌ట‌ప‌డుతున్నాయి.

ఈ ద‌శ‌లో రాష్ట్రానికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ‌స్తుండ‌టంతో బీజేపీ త‌మ జాతీయ అధ్య‌క్షుడైన జేపీ న‌డ్డాను పాద‌యాత్రకు పిలిపించుకుంది. రాష్ట్ర పార్టీ నేత‌లంతా ఐక్యంగా ఉన్నామ‌న్న మెసెజ్ పంపే ప్ర‌య‌త్నం చేసింది. కానీ అది కూడా పెద్ద‌గా వ‌ర్క‌వుట్ కాలేదు. పైగా బీజేపీ మీటింగ్ తో పోల్చితే కాంగ్రెస్ స‌భ‌కు మైలేజ్ ఎక్కువ‌గా వ‌చ్చింది. దీంతో అల‌ర్ట్ అయిన బీజేపీ… హోంమంత్రి, ఆ పార్టీ ట్ర‌బుల్ షూట‌ర్ అమిత్ షాను ఆహ్వానించింది. ఆయ‌న కూడా ఓకే అన‌టంతో ఖుషీగా ఉంది. ఇంతవ‌ర‌కు బాగానే ఉన్నా, అమిత్ షా వ‌చ్చాక బీజేపీ నేత‌ల మ‌ధ్య ఉన్న గ్రూపుల‌కు పుల్ స్టాప్ పెడ‌తాడా… కాంగ్రెస్‌లో ఉన్న అసంతృప్తుల‌కు తీవ్ర హెచ్చ‌రిక‌లు చేసి సెట్రైట్ చేసే ప్ర‌య‌త్నం చేసిన రాహుల్ గాంధీలాగా… అమిత్ షా కూడా బీజేపీ నేత‌ల‌కు ఓపెన్ గానే వార్నింగ్ ఇస్తాడా, నేత‌ల‌ను సెట్రైట్ చేస్తాడా అన్న చ‌ర్చ బీజేపీలో జోరుగా సాగుతుంది. అమిత్ షా కూడా రాహుల్ లాగే ఓపెన్ అయితే బీజేపీ నేత‌ల తీరు మారుతుంద‌ని, షా లైట్ తీసుకుంటే మాత్రం బీజేపీ గ్రాఫ్ మ‌రింత ప‌డిపోక త‌ప్ప‌ద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

- Advertisement -