నార్మల్ డెలివరీ…గ్రీన్ ఇండియా ఛాలెంజ్

30
green
- Advertisement -

యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రతి PHC&సబ్ సెంటర్ లో నార్మల్ డెలివరీ అయిన ప్రతి సారి ఒక మొక్క నాటాలని కలెక్టర్ పమేలా సత్పతి నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా నార్మల్ డెలివరీ సందర్భంగా మొక్కలు నాటాలని తీసుకున్న నిర్ణయానికిగాను కలెక్టర్ పమేలా సత్పతిని ట్విట్టర్ వేదికగా అభినందించారు ఎంపీ సంతోష్ కుమార్.

మొక్కతో పాటు శిశువు పెరుగుతుందన్న మీ ఆలోచనలు అభినందనీయం అంటూ పేర్కొన్నారు. కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశానుసారం జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి Dr.మల్లికార్జున్ రావు సూచన మేరకు ఇవ్వాళ Phc బిబినగర్ లో లో Dr.KTR Satya Prakash గారి ఆధ్వర్యంలో నార్మల్ డెలివరీ అయిన తల్లి పొడిసెట్టీ శ్రావణి తో phc లో పనిచేస్తున్న సిబ్బంది తో కలిసి మొక్క నాటారు.ఈ సందర్భంగా మొక్కలు నాటిన శ్రావణి గర్వంగా ఫీలవుతున్నానని అన్నారు.ఈ కార్యక్రమం లో స్టాఫ్ నర్స్ లు జెపి చిన్ని, జ్యోతి, పావని, ఆరోగ్య కార్య కర్తలు కవిత , ఆశలు మరియు ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -