నరసింహ..కాంబో రిపీట్!

40
rajini
- Advertisement -

సూపర్ రజనీ ఆల్ టైమ్ హిట్ సినిమాల్లో ఒకటి నరసింహ. ఈ సినిమాలో రజనీ డైలాగ్‌లు, రమ్యకృష్ణ నటన ఇప్పటికి ప్రేక్షకులకు గుర్తుండే ఉంటుంది.చాలాకాలం తర్వాత వీరిద్దరూ కలిసి వెండితెరపై నటించనున్నారు.

రజనీ తన 169వ సినిమాను దిలీప్ కుమార్ దర్శకత్వంలో చేస్తుండగా ఈ సినిమాకు సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సినిమాలో ఒక పాత్రకోసం రమ్యకృష్ణను ఎంపిక చేసే పనిలో ఉన్నాడట డైరెక్టర్. ది కూడా నెగెటివ్ రోల్ అని సమాచారం.

దీంతో ఈ చిత్రంపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. నరసింహలో నీలాంబరి ఛాలెంజ్ డ్రామా ఎంత రసవత్తరంగా ఉందో , ఈ చిత్రంలో వీరి కాంబో కూడా వీర లెవెల్లో ఉండనున్నదని కోలీవుడ్ లో టాక్ నడుస్తోంది.

- Advertisement -